వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి దాఖలైన మొదటి మూడు చార్జిషీట్ల విచారణను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 13కు వాయిదా వేసింది.
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి దాఖలైన మొదటి మూడు చార్జిషీట్ల విచారణను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 13కు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, పెన్నా ప్రతాపరెడ్డి, ఇందూ శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, నిత్యానందరెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారులు మన్మోహన్, శ్యామ్యూల్, బీపీ ఆచార్య, ఆదిత్యానాథ్‌దాస్ తదితరులు కోర్టుకు హాజరయ్యారు. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డిలు హాజరుకు మినహాయింపు కోరగా కోర్టు అనుమతించింది. ఇదిలా ఉండగా ఇదే కేసుకు సంబంధించిన 8 చార్జిషీట్లపై విచారణను కోర్టు ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.