నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్‌ | Nitin Gadkari Tests Covid-19 Positive | Sakshi
Sakshi News home page

నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్‌

Jan 12 2022 2:31 PM | Updated on Jan 12 2022 2:32 PM

Nitin Gadkari Tests Covid-19 Positive - Sakshi

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి కరోనా సోకింది. ఈ మేరకు గడ్కరీ తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని,  హోం క్యారంటైన్‌లో ఉన్నానని ట్విట్టర్‌లో తెలిపారు. ఈ క్రమంలో ఆయన తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అయితే గడ్కరీకి కరోనా పాజిటివ్‌ రావడం ఇది రెండోసారి. ఆయనకు గతేడాది 2021 సెప్టెంబర్‌లో కరోనా వచ్చిన సంగతి తెలిసిందే.

పైగా ఈ కరోనా మూడోవేవ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పార్టీ ఉపాధ్యక్షుడు రాధా మోహన్ సింగ్ వంటి పలువురు పార్టీ సహోద్యోగుల తోపాటు నితిన్‌ గడ్కరీ కూడా ఈ కరోనా మహమ్మారి భారిన పడ్డారు. ఇటీవలే కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండే కూడా తనకు కరోనా వచ్చిందని, అయితే తాను ఇప్పడూ పూర్తిగా కోలుకున్నాని తెలియజేసిన సంగతి విధితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement