Home Minister Rajnath
-
నేడు ‘పెన్సిల్’ పోర్టల్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: జాతీయ బాల కార్మిక నిర్మూలన వ్యవస్థ ప్రాజెక్టును మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు పెన్సిల్ (ప్లాట్‌ఫాం ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్) వెబ్ పోర్టల్‌ను హోం మంత్రి రాజ్‌నాథ్ మంగళవారం ఆవిష్కరిస్తారు. -
కీలక ‘మూడో దఫా’ ముగిసింది..పోలింగ్ ఎంతంటే?
లక్నో: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఉత్తరప్రదేశ్ మూడో దఫా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 69 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరిగింది. 61.16శాతం ఓటింగ్ నమోదైంది. మూడో దఫా పోలింగ్‌లోనే హోంమంత్రి రాజ్‌నాథ్ లోక్‌సభ స్థానమైన లక్నో, ఎస్పీకి పట్టున్న కన్నౌజ్, మైన్ పురి, ఇటావా ప్రాంతాలున్నాయి. ఫరూకాబాద్, హర్దోయ్, అవురైయా, కాన్పూర్ దేహత్, కాన్పూర్, ఉన్నావో, బరాబంకి, సీతాపూర్ తదితర 12 జిల్లాల్లో పోలింగ్ జరిగింది. ఈ ప్రాంతంలో మొత్తం 2.41 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 826 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇటావా.. ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ సొంత జిల్లా. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్‌యాదవ్ కన్నౌజ్ ఎంపీ. ఎస్పీ మరో కీలక ఎంపీ తేజ్‌ప్రతాప్ యాదవ్‌ది మైన్ పురి జిల్లా. దీంతో మూడో దఫా అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారింది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 69 స్థానాల్లో ఎస్పీ 55 గెలుచుకుంది. -
యూపీ ‘మూడో దశ’ నేడు
లక్నో: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల మూడో దశకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. 69 స్థానాలకు ఆదివారం జరగనున్న ఈ దశ పోలింగ్‌లో హోంమంత్రి రాజ్‌నాథ్ లోక్‌సభ స్థానం లక్నో, ఎస్పీకి పట్టున్న కన్నౌజ్, మైన్ పురి, ఇటావా ప్రాంతాలున్నాయి. ఫరూకాబాద్, హర్దోయ్, అవురైయా, కాన్పూర్ దేహత్, కాన్పూర్, ఉన్నావో, బరాబంకి, సీతాపూర్ తదితర 12 జిల్లాల్లో జరుగుతున్న ఈ దశ పోలింగ్‌లో 2.41 కోట్ల మంది ఓటర్లు 826 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. మొత్తం 25,603 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఇటావా... ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ సొంత జిల్లా. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్‌యాదవ్ కన్నౌజ్ ఎంపీ. ఎస్పీ మరో కీలక ఎంపీ తేజ్‌ప్రతాప్æ యాదవ్‌ది మైన్ పురి జిల్లా. దీంతో ఈ దశ అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారింది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 69 స్థానాల్లో ఎస్పీ 55 గెలుచుకుంది.