
రాజకీయ తీర్థం పుచ్చుకున్న క్రికెటర్
లక్నో: భారత పేస్ బౌలర్ ప్రవీణ్‌కుమార్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అధికార సమాజ్‌వాదీ పార్టీ తీర్థాన్ని ఆయన పుచ్చుకున్నారు. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆదివారం లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రవీణ్‌కుమార్‌కు కండువా కప్పి ఎస్పీలోకి ఆహ్వానించారు.
మీరట్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ టీమిండియా తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఆరు టెస్టులు ఆడిన ప్రవీణ్ 27 వికెట్లు పడగొట్టాడు. 68 వన్డే మ్యాచ్‌లు ఆడి 77వికెట్లు తీసుకున్నాడు. పది టీ-20 మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు సాధించాడు. చివరగా 2012 ఆగస్టులో టీమిండియా సభ్యుడిగా దక్షిణాఫ్రికాతో టీ-20 మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ లయన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.