న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం సాగించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, సీఎం ఆతిశీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా 40 మంది ఆప్ నేతల పేర్లు ఉన్నాయి.
ఈసారి ఢిల్లీలో ఎన్నికల ప్రచారం కోసం పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌లతో పాటు మంత్రులు సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, ఢిల్లీ, పంజాబ్ మంత్రులను స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేయనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ ప్రచారకర్తల జాబితాలో మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్, హర్భజన్ సింగ్, మీట్ హయర్, దిలీప్ పాండే, రాంనివాస్ గోయల్, గులాబ్ సింగ్, రితురాజ్ గోవింద్ ఉన్నారు.
మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా విడుదల చేసింది, ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, ఖాజీ నిజాముద్దీన్, దేవేంద్ర యాదవ్, అశోక్ గెహ్లాట్, హరీష్ రావత్, ముకుల్ వాస్నిక్, కుమారి సెల్జా, రణదీప్ సింగ్ సుర్జేవాలా, సచిన్ పైలట్, సుఖ్వీందర్ సింగ్ సుఖుతో సహా మొత్తం నలభై మంది నేతలు ప్రచారంలో పాల్గొననున్నారు.
Aam Aadmi Party announces the list of 40-star campaigners for the #DelhiAssemblyElection2025
AAP National Convenor Arvind Kejriwal, his wife Sunita Kejriwal, Delhi CM Atishi, Manish Sisodia, Sanjay Singh, Punjab CM Bhagwant Mann's names are included in the list of star… pic.twitter.com/glRzUwuT6N— ANI (@ANI) January 19, 2025
ఇదేవిధంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తన స్టార్ ప్రచారకుల జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్, ఖట్టర్, ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్ సింగ్ పూరి, గిరిరాజ్ సింగ్ సహా 40 మంది నేతల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. బీజేపీ జాబితాలో నలుగురు సినీ ప్రముఖులు కూడా స్టార్ క్యాంపెయినర్లుగా కనిపించనున్నారు. ఢిల్లీలో ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి: Success Story: నాడు అమ్మతోపాటు గాజులమ్మి.. నేడు ఐఏఎస్ అధికారిగా..
Comments
Please login to add a commentAdd a comment