serious consequences
-
అమెరికాకు డెడ్‌లైన్ విధించిన తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు అమెరికాకు తాజా హెచ్చరికలు జారీ చేశారు. అగస్టు 31లోగా సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ డెడ్‌లైన్ విధించారు. ఈ మేరకు తాలిబన్ ప్రతినిధి సుహైల్ షహీన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 31 లోపు కాబూల్ విమానాశ్రయం నుండి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని తాలిబన్లు అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సైనిక బలగాల ఉపసంహరణ గడువును మరింత పెంచే యోచనలో ఉన్నట్టు బైడెన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువులోగా సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చి చెప్పారు. మిత్రదేశాలకూ వార్నింగ్ అలాగే అమెరికాతోపాటు మిత్ర దేశాలకు కూడా ఇదే తరహా హెచ్చరిక జారీ చేశారు. వారంలోగా అన్ని దేశాల సైనికులు అఫ్గాన్ విడిచి వెళ్లాలని స్పష్టం చేశారుర. లేదంటే వెళ్లకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అన్ని దేశాల సైనికులు వెళ్లాకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తాలిబన్లు ప్రకటించారు. మరోవైపు దేశం విడిచివెళ్లేందుకు వేలాదిగా ప్రజలు కాబూల్ విమానాశ్రయానికి తరలివస్తున్నారు. ఈ సందర్బంగా తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు తలెత్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరూ దేశం విడిచి వెళ్లవద్దని తాలిబన్లు ప్రజలకు విజప్తి చేస్తున్నారు. చదవండి : Afghanistan: తొలి ఫత్వా జారీ చేసిన తాలిబన్లు.. అనుకున్నదే అయింది! Afghanistan: ఆమె భయపడినంతా అయింది! అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ రాజ్యం.. క్రికెటర్‌తో నిశ్చితార్థం రద్దు: నటి -
డీఎంకేలో చేర్చుకోకుంటే ఖబడ్దార్: అళగిరి
మదురై: డీఎంకేలోకి తనను మళ్లీ చేర్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని తన సోదరుడు, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను బహిష్కృత నేత అళగిరి హెచ్చరించారు. మంగళవారం డీఎంకే అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరగనున్న డీఎంకే సర్వసభ్య సమావేశంలో స్టాలిన్ ఎన్నిక లాంఛనమే కానుంది. పార్టీలోకి తనను చేర్చుకోకుంటే సెప్టెంబర్ 5న చెన్నైలో తలపెట్టిన ర్యాలీలో తన సత్తా ఏంటో చూపిస్తానని అళగిరి అన్నారు. కరుణానిధికి నివాళులర్పించేందుకు నిర్వహిస్తోన్న ఈ ర్యాలీకి పార్టీ కార్యకర్తలు తన నాయకత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు. కరుణానిధి మరణం తర్వాత పార్టీని కాపాడటానికే తాను ఇవన్ని చేస్తున్నానని విలేకరులతో చెప్పారు. -
చైనా-భారత్‌ల మధ్య జర్నలిస్ట్‌ల వివాదం
-
నల్లధనంతో...తీవ్ర పరిణామాలు తప్పవు
♦ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ హెచ్చరిక ♦ ప్రస్తుత పథకాన్ని వినియోగించాలని సూచన న్యూఢిల్లీ: నల్లధనం దాచిపెట్టుకునేవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదని ఆర్థికమంత్రి గురువారం అరుణ్‌జైట్లీ హెచ్చరించారు. నల్లధనం వెల్లడి, 45 శాతం పన్ను చెల్లింపు, ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపుకు సంబంధించి సెప్టెంబర్ వరకూ అమలు జరిగే ప్రస్తుత పథకాన్ని ఉపయోగించుకోవాలనీ ఆయన సూచించారు. ఇప్పటికీ తన విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించని వారు తొందరపడాలని పేర్కొన్నారు. నల్లధనం నిరోధం ఇప్పుడు కేవలం భారత్‌కు సంబంధించిన అంశమే కాదనీ, జీ-20, యూఎస్ డొమేస్టిక్ లా వంటి చొరవలతో అంతర్జాతీయంగా ఈ సమస్య పరిష్కారానికి కృషి జరుగుతోందని ఫిక్కీ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో జైట్లీ పేర్కొన్నారు. సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం మొదలయిన తర్వాత విదేశాల్లో రహస్య ఆస్తులను కనిపెట్టడం కూడా పెద్ద కష్టం కాబోదని జైట్లీ ఈ సందర్భంగా అన్నారు. బస్సు పోగొట్టుకోవద్దు... ప్రస్తుత పథకాన్ని జైట్లీ ఉదహరిస్తూ, ‘ ప్రస్తుత బస్సు పోగొట్టుకుంటే, చాలా పోగొట్టుకుంటారు’ అని హెచ్చరించారు. పన్ను ఎగవేతలను సహించేది లేదని, ప్రస్తుత ఆదాయపు పన్ను శాఖ సాంకేతిక అభివృద్ధి తప్పు చేస్తున్నవారు ఎక్కడ ఉన్నా పట్టిస్తుందని తెలిపారు. వస్తు, సేవల పన్ను విధానం అమలు పన్ను ఎగవేతల దిశలో మరో కీలక అడుగవుతుందని అన్నారు. రానున్న నాలుగు సంవత్సరాల్లో ప్రస్తుత 30 శాతం కార్పొరేట్ పన్నును 25 శాతానికి కేంద్రం తగ్గిస్తుందని, ఇది ప్రపంచస్థాయి పోటీపూర్వక పరిస్థితికి అవసరమని అన్నారు. కాగా నల్లధనం వెల్లడి పథకం మరోసారి ఉండబోదని రెవెన్యూ కార్యదర్శి హాస్ముఖ్ ఆదియా ఈ సందర్భంగా పేర్కొన్నారు.