Indiscipline
-
‘కలెక్టర్ బ్రో’ సహా ఇద్దరు ఐఏఎస్‌ల సస్పెన్షన్
తిరువనంతపురం: కేరళలో ఇద్దరు ఐఏఎస్ అధికారులపై వేటుపండింది. క్రమశిక్షణ ఉల్లంఘన కారణంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం సోమవారం ఇద్దరు ఐఏఎస్ అధికారులు కె గోపాలకృష్ణన్, ఎన్ ప్రశాంత్‌లను సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మత ఆధారిత ప్రభుత్వ అధికారుల వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసినందుకు ఐఏఎస్ గోపాలకృష్ణను సస్పెండ్ చేయగా, సోషల్ మీడియాలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని విమర్శించినందుకు ఐఏఎస్ ప్రశాంత్‌పై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌కు ‘‘కలెక్టర్ బ్రో’’గా సోషల్ మీడియాలో పాపులారిటీ ఉంది. అయితే.. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అధికారులను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు.. తన మొబైల్ ఫోన్‌ను గుర్తుతెలియని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారని ఐఏఎస్ అధికారి కె. గోపాల్‌కృష్ణన్ అన్నారు. తన అనుమతి లేకుండా మతపరమైన వాట్సాప్ గ్రూపులను సృష్టించారని ఐఏఎస్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఐఏఎస్ అధికారి వాదనలను పోలీసు దర్యాప్తు అధికారి తోసిపుచ్చారు. ఆయన ఫోన్ హ్యాక్ చేయబడిందని తమకు ఎటువంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ పరీక్ష కోసం పరికరాన్ని సమర్పించే ముందు గోపాలకృష్ణన్ మొబైల్ ఫోన్‌ను చాలాసార్లు రీసెట్ చేసినట్లు పోలీసులు వెల్లడించినట్లు తెలిపారు. -
ఒడిశాలో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే బహిష్కరణ
భువనేశ్వర్: క్రమశిక్షణారాహిత్యం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే కారణాలతో కాంగ్రెస్ పార్టీ ఒడిశాలో తమ సీనియర్ ఎమ్మెల్యే సురేష్ కుమార్ రౌట్రేను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అందిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని సురేష్‌కుమార్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం ప్రకటించారు. జటానీ నియోజకవర్గం నుంచి సురేష్ కుమార్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి ఆయన తనయుడు మన్మథ్ రౌట్రే బిజూ జనతాదళ్ అభ్యరి్థగా భువనేశ్వర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. కుమారుడిగా మద్దతుగా నిలుస్తున్నారని, బీజేడీ నేతలతో వేదికను పంచుకుంటున్నారని సురేష్ కుమార్‌పై ఫిర్యాదులు వచ్చాయి. కాంగ్రెస్‌తో తనది ఐదు దశాబ్దాల అనుబంధమని, తనను బహిష్కరించినా చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని, బహిష్కరణపై అధిష్టానంతో మాట్లాడతానని సురేష్‌కుమార్ స్పందించారు. -
Sakshi Cartoon: గోడలు లేనిచోట కలిస్తే పోలా..!
గోడలు లేనిచోట కలిస్తే పోలా..! -
వినేశ్ ఫొగాట్ సస్పెండ్
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా క్రమశిక్షణ రాహిత్యం, విపరీత ధోరణితో వ్యవహరించిన భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై సస్పెన్షన్ వేటు పడింది. అలాగే సంజాయిషీ కోరుతూ ఆమెతో పాటు మరో రెజ్లర్ సోనమ్ మాలిక్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టోక్యో విశ్వక్రీడల్లో వినేశ్ క్వార్టర్ ఫైనల్లో ఓడింది. హంగేరి శిక్షణకు వెళ్లిన ఆమె అక్కడి నుంచే నేరుగా టోక్యోకు వచ్చింది. కానీ భారత జట్టు క్రీడాకారులు బస చేసిన క్రీడా గ్రామంలో ఉండకుండా వెలుపల తన హంగేరి కోచ్, సహాయకులతో బస చేసింది. భారత ఇతర మహిళా రెజ్లర్లు సోనమ్, సీమా, అన్షు భారత్ నుంచి టోక్యోకు రావడంతో వారి నుంచి తనకు కరోనా సోకే ప్రమాదం ఉండవచ్చని భావిస్తూ వినేశ్ వారితో కలిసి ఉండేందుకు, కలిసి ప్రాక్టీస్ చేసేందుకు నిరాకరించింది. ఒలింపిక్స్ రెజ్లింగ్ బౌట్లలో టీమిండియా అధికారిక ‘శివ్ నరేశ్’ టీమ్ జెర్సీలను కాదని వినేశ్ నైకీ జెర్సీలను ధరించి బరిలోకి దిగింది. ఆమె విపరీత పోకడ, క్రమశిక్షణ రాహిత్యం భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు ఆగ్రహం తెప్పించింది. దీంతో కఠిన చర్యలు చేపట్టింది. ‘ఫొగాట్ తన ప్రవర్తనతో తీవ్రస్థాయిలో క్రమశిక్షణను ఉల్లంఘించింది. అందుకే తాత్కాలిక నిషేధం విధించాం. ఇపుడామె ఎలాంటి రెజ్లింగ్ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వీల్లేదు. ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసు కూడా పంపాం. సంజాయిషీ ఇచ్చేందుకు ఈ నెల 16లోగా గడువిచ్చాం’ అని డబ్ల్యూఎఫ్ఐ అధికారి ఒకరు వెల్లడించారు. -
ప్రశాంత్ కిషోర్‌పై జేడీయూ వేటు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్పీఆర్) విషయంలో పార్టీ వైఖరిని ప్రశ్నించినందుకు పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్‌ను జనతాదళ్(యూ) బహిష్కరించింది. సీఏఏ, ఎన్పీఆర్లను వ్యతిరేకిస్తున్న కిషోర్... ఈ విషయంలో పార్టీ వైఖరిని తప్పుబడుతున్నారు. నితీశ్ ఈ రెండింటికీ మద్దతివ్వటాన్ని ప్రశాంత్‌తో పాటు జేడీ(యూ) ప్రధాన కార్యదర్శి పవన్ వర్మ విమర్శించారు. ఈ రెండింటికీ వ్యతిరేకంగా విపక్షాలు ఒక్కటవ్వాలని ప్రశాంత్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీనుంచి వారిద్దరినీ బహిష్కరిస్తున్నట్లు జేడీయూ తెలిపింది. ‘వారిద్దరూ సీఎంను అవమానించేలా మాట్లాడారు. పార్టీ క్రమశిక్షణను అతిక్రమించారు’ అని పార్టీ పేర్కొంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి, పార్టీ పదవుల నుంచి తక్షణమే అమల్లోకి వచ్చేలా ప్రశాంత్ కిషోర్, పవన్ వర్మలను బహిష్కరిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. నితీశ్ మళ్లీ సీఎం కావాలి: ప్రశాంత్ బహిష్కరణ ప్రకటన వెలువడిన వెంటనే ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. ‘కృతజ్ఞతలు నితీశ్‌జీ. మీరు మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ’ అని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించడం వల్లే ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలో చేర్చుకున్నానని మంగళవారం నితీశ్ చెప్పటంతో ఇద్దరి మధ్యా విభేదాలు తీవ్రమయ్యాయి. దానిపై ప్రశాంత్ కిషోర్ ఆగ్రహిస్తూ... ‘‘ఎంత దిగజారిపోయారు!!. ఇలాంటి అబద్ధం చెప్పి నన్నూ మీ స్థాయికి లాగుతున్నారా? ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే అమిత్ షా సిఫారసులున్న నన్ను తొలగించే ధైర్యం మీకుంటుందా? దాన్ని ఎవరైనా నమ్ముతారా?’’ అని ప్రశ్నించారు. తృణమూల్‌లో చేరనున్నారా? ప్రశాంత్ త్వరలో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరతారని వినిపిస్తోంది. కానీ ఈ వార్తను తృణమూల్ వర్గాలు నిర్ధారించలేదు. భవిష్యత్తులో ఆ అవకాశం లేకపోలేదంటూ... ఆ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ లేదా తమ అధినేత్రి మమత బెనర్జీనే ధ్రువీకరించాలని టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ పేర్కొన్నారు. మమత బెనర్జీతో ప్రశాంత్‌కు సంబంధాలున్నాయన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రశాంత్ సేవలను టీఎంసీ ఉపయోగించుకుంటోంది. -
21 మందిపై నిషేధం
వివిధ టోర్నీల్లో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడిన 21 మంది క్రీడాకారులు, కోచ్‌లపై హాకీ ఇండియా (హెచ్ఐ) నిషేధం విధించింది. అఖిల భారత బాంబే గోల్డ్‌కప్ టోర్నీలో అనుచితంగా ప్రవర్తించిన పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ జట్టుకు చెందిన సర్వంజిత్‌సింగ్, కరంజిత్‌సింగ్, గురుప్రీత్‌సింగ్ ఆరు నెలలపాటు నిషేధానికి గురయ్యారు. వీరితోపాటు గత ఏడాది మరో టోర్నీలో ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన వీరేందర్‌సింగ్, బచిత్తర్ సింగ్‌లపై ఆరు నెలలు, మరో సంఘటనకు సంబంధించి నాంధారి ఎలెవన్ జట్టు ఆటగాడు హర్‌ప్రీత్‌సింగ్‌పై మూడు నెలలు నిషేధం విధించింది. వీరేగాక గత ఫిబ్రవరిలో ఇండియా ఇన్విటేషన్ టోర్నీలో మైదానం వీడి నిరసన తెలిపిన నార్త్ సెంట్రల్ రైల్వేస్ మహిళల జట్టులోని మొత్తం 16 మందినీ ఆరు నెలలపాటు ఎటువంటి టోర్నీల్లోనూ పాల్గొనకుండా నిషేధించింది. ఈ జట్టు మేనేజర్ పుష్పా శ్రీవాత్సవ మూడు నెలలు, కోచ్ శ్రద్ధా వర్మ ఆరు నెలలు నిషేధానికి గురయ్యారు. వీరందరిపైనా నిషేధం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని, ఆ తరువాత ఏడాదిపాటు వీరు మరోసారి అటువంటి చర్యలకు పాల్పడితే మరో ఏడాది నిషేధానికి గురికావాల్సివస్తుందని హెచ్ఐ హెచ్చరించింది. అయితే నిషేధం విషయంలో 30 రోజుల్లో అప్పీలు చేసుకోవచ్చని పేర్కొంది.