సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్తో బుధవారం ఇక్కడ భేటి అయ్యారు.
సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్తో బుధవారం ఇక్కడ భేటి అయ్యారు. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం గురించి ఆయనకు వివరించారు. సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులు అర్థమవుతున్నాయని పటేల్ తమతో అన్నట్టు భేటీ అనంతరం సీమాంధ్ర నాయకులు చెప్పారు.
రాష్ట్ర విభజనపై వెనక్కి వెళ్లలేమని, అలాగని ఇప్పటికప్పుడు ముందుకెళ్లలేని పరిస్థితి ఉందని పటేల్ తమతో అన్నట్టు వివరించారు. రాష్ట్రంలో ఇరు ప్రాంతాల వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. విషయాలన్నింటినీ పార్టీ అధినేత సోనియా గాంధీ దృష్టికి తీసుకెళతానని చెప్పినట్టు సీమాంధ్ర నాయకులు చెప్పారు.