న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఖర్చు వివరాలు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. అందులోని వివరాల ప్రకారం ఆ పార్టీకి రూ. 856 కోట్లను సమీకరించగా, అందులో రూ. 820.9 కోట్లు ఖర్చయినట్లు శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ట్రెజరర్ అహ్మద్ పటేల్ సంతకం చేసిన పత్రాలను ఈసీకి అందించారు. ఇందులో ఎన్నికల వ్యవహారాల కోసం రూ. 626.36 కోట్లు ఖర్చు చేయగా, రూ. 194 కోట్లు అభ్యర్థుల కోసం ఖర్చు చేసినట్లు తెలిపింది.
లోక్‌సభ ఎన్నికల అనంతరం తమ దగ్గర మొత్తం రూ. 315.88 కోట్లు మిగిలినట్లు తెలిపింది. ఇందులో రూ. 265 కోట్లు బ్యాంకులో ఉండగా, రూ. 50 కోట్లు చేతిలో ఉన్నట్లు తెలిపింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ రూ. 516 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు బీజేపీ రూ. 714 కోట్లు ఖర్చుచేయగా 2019 వివరాలు వెల్లడించాల్సి ఉంది. (చదవండి: ‘గాంధీ’లకు ఎస్పీజీ భద్రత తొలగింపు)
Comments
Please login to add a commentAdd a comment