
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ (71) కన్నుమూశారు. నెల రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు ఫైజల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. కరోనా బారిన పడి పలు అవయవాలు దెబ్బతినడంతో అహ్మద్ పటేల్ కన్నుమూశారని పేర్కొన్నారు. అహ్మద్ పటేల్ తాను కరోనా బారిన పడినట్లు అక్టోబర్ 1న ట్విటర్ ద్వారా తెలిపారు. అనంతరం నవంబర్ 15న ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజులుగా ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. నెలరోజుల పాటు కరోనాతో పోరాడిన అహ్మద్ పటేల్ బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు.
Comments
Please login to add a commentAdd a comment