న్యూఢిల్లీ: నిన్నటి వరకు తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన బంగారం ధరలు మంగళ, బుధవారం స్వల్పంగా తగ్గాయి. మళ్లీ నేడు భారీగానే బంగారం ధర పెరిగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారంపై రూ.400 వరకు పెరుగగా, ఢిల్లీలో రూ.350 వరకు పెరిగింది. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,352 నుంచి రూ.46,706కు పెరిగింది. అలాగే, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,783 నుంచి రూ.42,852కు చేరుకుంది. అలాగే బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.66,444 నుంచి రూ.67,953కు పెరిగింది. ఒక చోట బంగార ధర పెరుగుదల తక్కువగా ఉంటే, మరో చోట ఎక్కువగా ఉంది. అయితే బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయానికి ఏ రేట్లు ఉన్నాయో తెలుసుకొని వెళితే మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment