
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తన తొలి రోజు పర్యటనలో భాగంగా గురువారం భారత రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ను మర్యాద పూర్వకంగా కలిసారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం సాయంత్రం డిల్లీ చేరుకున్న గవర్నర్.. గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్‌ను సందర్శించారు. గవర్నర్ హోదాలో దేశాధ్యక్షుడిని తొలిసారి కలుసుకున్న హరిచందన్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్ధితులను వివరించారు. శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయిడు, హోం మంత్రి అమిత్ షా లను గవర్నర్ కలవనున్నారు. గవర్నర్ బిశ్వభూషన్‌తోపాటు కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఎడిసి మాధవ రెడ్డి, ఆంధ్రా భవన్ అధికారులు ఉన్నారు.