సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై జరుగుతున్న అరాచకాలు తగ్గాయి. ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన క్రైమ్ రికార్డు జాబితాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది మహిళల మీద జరుగుతున్న నేరాలు గతేడాదితో పోలిస్తే 2,111 తగ్గాయని ఆ నివేదిక వెల్లడించింది. 2020 సెప్టెంబర్ వరకు 7,236 కేసులు నమోదయ్యాయి. ఇది గతేడాదివతో పోలీస్తే 22.58 శాతం తక్కువ. గతేడాది 9,347 కేసులు నమోదయ్యాయి.
ఇక ఈ ఏడాది మహిళళపై జరుగుతున్న అత్యాచారాలు కూడా 29.8 శాతం తగ్గాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఢిల్లీలో ఐపీసీ సెక్షన్ 376 కింద 1,132 కేసులు నమోదయ్యాయి. అదే 2019లో ఈ కేసుల సంఖ్య 1613గా ఉంది. ఇదిలా ఉండగా ఐపీసీ సెక్షన్ 509 ( మహిళలను అవమానించడం) కింద నమోదయిన కేసుల సంఖ్య 312 రెట్లు పెరిగాయి. ఈ కేసులు 2019లో 333 నమోదు కాగా, 2020లో వీటి సంఖ్య ఒక్కసారిగా 1,374కు పెరిగింది. ఇక వరకట్న వేధింపులకు సంబంధించి 2020లో సెప్టెంబర్ 15వరకు 89 కేసులు నమోదు కాగా 2019లో వీటి సంఖ్య 107గా ఉంది. మొత్తం మీద 2020లో మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య గణనీయంగానే తగ్గింది. మహిళల కిడ్నాప్‌ల సంఖ్య కూడా తగ్గింది. అయితే ఇది లాక్‌డౌన్ కారణంగా తగ్గిందా? భద్రతా ప్రమాణాలు పెంచడం వల్ల తగ్గింద అన్నది తెలియాల్సి ఉంది.
మహిళలపై నేరాలు తగ్గుముఖం
Published Tue, Nov 3 2020 10:41 AM | Last Updated on Tue, Nov 3 2020 10:42 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment