అమెజాన్‌తో ప్రియాంక భారీ డీల్‌ | Priyanka Chopra Multi Million Dollar Television Deal With Amazon | Sakshi
Sakshi News home page

అమెజాన్‌తో ప్రియాంక భారీ డీల్‌

Published Wed, Jul 1 2020 5:28 PM | Last Updated on Wed, Jul 1 2020 7:03 PM

Priyanka Chopra Multi Million Dollar Television Deal With Amazon - Sakshi

న్యూఢిల్లీ : గ్లోబ‌ల్‌ స్టార్ ప్రియాంక చోప్రా అమెజాన్‌ ప్రైమ్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. మల్టీ మిలియన్‌ డాలర్లు విలువ చేసే ఫస్ట్‌ లుక్‌ అనే టెలివిజన్‌ డీల్‌పై ఆమె సంతకం చేశారు. ఇందుకోసం ఆమె రెండేళ్లపాటు అమెజాన్‌తో కలిసి పనిచేయనున్నారు. ఈ సందర్బంగా ప్రియాంక స్పందిస్తూ.. హిందీ, ఇంగ్లిష్‌ల్లోనే కాకుండా తనకు ఇష్టమైన భాషల్లో కూడా నటిస్తానని ప్రియాంక స్పష్టం చేశారు. మహిళలకు సంబంధించిన కథలను చూపించాలనేదే తన కోరికని తెలిపారు. ఆ కథలను విభిన్నంగా చూపించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప క్రియేటర్స్‌తో కలిసి పనిచేయనున్నట్టు చెప్పారు. అందుకు అమెజాన్‌ లాంటి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ కలిగి ఉన్న భాగస్వామి దొరకడం ఆనందంగా ఉందన్నారు. (చదవండి : పోలీసులను ఆశ్రయించిన తరుణ్‌ భాస్కర్)

‘భాష, భౌగోళిక బేధాలు లేకుండా ప్రపంచలోని ప్రతిభ ఒక చోట చేరి మరింత గొప్ప కంటెంట్‌ సృష్టించాలని ఓ నటిగా, నిర్మాతగా నేను కోరుకుంటాను. నా ప్రొడక్షన్‌ హౌస్‌ పర్పుల్‌ పెబెల్‌ పిక్చర్స్‌ ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు అమెజాన్‌తో కలిసి పనిచేయడం కొత్తదనానికి పునాది లాంటింది. అలాగే కథకురాలిగా నిరంతరం కొత్త ఐడియాలును అన్వేషించాలనేదే నా తపన. అవి కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా ముఖ్యంగా ఒపెన్‌ మైండ్స్‌, నూతన దృక్పథం కలిగి ఉండాలి. నా 20 ఏళ్ల కేరీర్‌లో దాదాపు 60 సినిమాలు చేసిన తర్వాత.. ఇప్పుడు దానిని సాధించే బాటలో ఉన్నట్టు నమ్ముతున్నాను’ అని తెలిపారు. (చదవండి : ఇండియా నుంచి ఈ ఇద్దరూ..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement