
సాక్షి, న్యూఢిల్లీ: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ల వివాహం జోధ్‌పూర్‌లోని ఉమైద్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అదేరీతిలో మంగళవారం ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో రిసెప్షన్‌న్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. మోదీ, ప్రియానిక్‌లతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, వారికి విషెస్ చెప్పారు. (పైళ్లైపోయిందోచ్..!)
రిసెప్షన్‌లో ప్రియాంక తన భర్త నిక్ జోనాస్‌తో పాటు అతని కుటుంబ సభ్యులను మోదీకి పరిచయం చేశారు. మోదీ రాకతో ప్రియానిక్‌లతో పాటు వారి కుటుంబసభ్యులు తెగ సంబరపడిపోయారు. గతంలో కూడా విరాట్ కోహ్లి-అనుష్క శర్మల రిసెప్షన్‌కు కూడా మోదీ హజరైన విషయం తెలిసిందే. డిసెంబర్ 1, 2 తేదీల్లో నిక్ జోనస్, ప్రియాంకా చోప్రా క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లికి ముందు జరిగిన సంగీత్, మెహందీ వేడుకలతో పాటు పెళ్లి, రిసెప్షన్ ఫోటోలు నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. (కన్నీటి పర్యంతమైన ప్రియాంక!)
థ్యాంక్స్ చెప్పిన ప్రియాంక
ఎన్నికల బిజీలోనూ తమను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రియాంక చోప్రా ధన్యవాదాలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ మా రిసెప్షన్‌కు వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు రావటం చాలా సంతోషంగా ఉంది. మీ దీవెనలు, మీరు చెప్పిన మాటలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి’అంటూ ప్రియాంక పేర్కొన్నారు. (సరదాల సంగీత్)
Comments
Please login to add a commentAdd a comment