అది నిజం కాదు! | Priyanka Chopra Denies reports of her meeting Meghan Markle son Archie | Sakshi
Sakshi News home page

అది నిజం కాదు!

Published Sat, Jun 1 2019 12:32 PM | Last Updated on Sat, Jun 1 2019 1:08 PM

Priyanka Chopra Denies reports of her meeting Meghan Markle son Archie - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నుంచి అంతర్జాతీయ తారగా ఎదిగిన ప్రియాంక చోప్రా- బ్రిటన్‌ రాజకుటుంబం కోడలు మేఘన్‌ మర్కెల్‌ మధ్య మంచి స్నేహబంధం ఉంది. వీరిద్దరు కలిసి గతంలో పలుసార్లు దర్శనమిచ్చారు. అయితే, వీరిమధ్య గతకొంతకాలంగా పొసగడం లేదని, ఇద్దరూ మిత్రుల మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే ప్రియాంక-నిక్‌ జోనస్‌ పెళ్లికి మేఘన్‌ మర్కెల్‌ రాలేదని ఇటీవల కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన ‘ద సన్‌’ టాబ్లాయిడ్‌ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.

ఇంగ్లండ్‌కు వచ్చిన ప్రియాంక చోప్రా, భర్త నిక్‌ జోనస్‌తో కలిసి ససెక్స్‌ డ్యూచెస్‌ అయిన మేఘన్‌ను కలిశారని, ఈ సందర్భంగా మేఘన్‌ కొడుకు, రాయల్‌ బేబీ ఆర్చీకి పలు ఖరీదైన కానుకలు కూడా ఇచ్చారని పేర్కొంది. ఈ కథనాలపై ప్రియాంక స్పందిస్తూ.. ఇది నిజంకాదని తేల్చింది. ‘కానుకలు ఇవ్వడం అనేది గొప్ప ఐడియానే. కానీ, ఈ కథనం నిజం కాదు. నేను ఓ పని నిమిత్తం టౌన్‌లో ఉన్నా. ఈ ‘విశ్వసనీయ వర్గాలు’  ఎవరైతే ఉన్నారో వారు ఒక్కసారి నిజాలు సరిచూసుకుంటే బాగుంటుంది’ అని పీసీ ట్వీట్‌ చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement