
నీరవ్ మోదీతో ప్రియాంక చోప్రా (పాత చిత్రం)
సాక్షి, ముంబై : ప్రముఖ వజ్రాల వ్యాపారి, పంజాబ్ బ్యాంక్‌ను నిలువునా ముంచిన నీరవ్ మోదీపై దావా వేసినట్లు వస్తున్న వార్తలపై నటి ప్రియాంక చోప్రా స్పందించారు. అందులో ఎలాంటి నిజం లేదని ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.
‘నీరవ్‌కు చెందిన డైమండ్ కంపెనీపై దావా వేసిన వార్త అవాస్తవం’ అని అందులో ఆమె పేర్కొన్నారు. అయితే భారీ కుంభకోణం బయటపడిన నేపథ్యంలో ఆ కంపెనీతో ఆమె చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకునే యోచనలో మాత్రమే ఉన్నారని.. ఇందుకు సంబంధించి న్యాయనిపుణుల సలహాను ఆమె తీసుకుంటున్నారని ప్రియాంక వ్యక్తిగత కార్యదర్శి శుక్రవారం మీడియాకు తెలియజేశారు.
గతంలో ప్రియాంక చోప్రా హీరో సిధార్థ్ మల్హోత్రాతో కలిసి నీరవ్ మోదీకి చెందిన నగల కంపెనీ ప్రకటనలో నటించింది. ఇందుకు సంబంధించి పారితోషకాన్ని సదరు కంపెనీ పూర్తిగా చెల్లించలేదు. ఇంతలోనే నీరవ్ మోదీ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె సదరు కంపెనీపై దావా వేసేందుకు సిద్ధమైనట్లు కథనాలు వెలువడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment