
ప్రియాంక చోప్రా (ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై : ప్రముఖ వజ్రాల వ్యాపారి అయిన నీరవ్ మోదీ, దేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో దాదాపు రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణ నేపథ్యంలో నీరవ్ మోదీ జువెల్లరీలకు బ్రాండు అంబాసిడరీగా ఉన్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, ఆయనతో తెగదెంపులు చేసుకున్నారు. నీరవ్ మోదీ బ్రాండుతో ఉన్న కాంట్రాక్ట్‌ను ప్రియాంక చోప్రా రద్దు చేసుకున్నట్టు ఆమె అధికార ప్రతినిధి వెల్లడించారు.
దీనిపై కొన్ని రోజుల క్రితమే ప్రియాంక న్యాయ నిపుణులు సలహా తీసుకుంటున్నారని ఆమె వ్యక్తిగత కార్యదర్శి పేర్కొన్న సంగతి తెలిసిందే. గతంలో ప్రియాంక చోప్రా హీరో సిధార్థ్ మల్హోత్రాతో కలిసి నీరవ్ మోదీకి చెందిన జువెల్లరీ కంపెనీ ప్రకటనలో నటించారు. ఇందుకు సంబంధించి పారితోషకాన్ని సదరు కంపెనీ పూర్తిగా చెల్లించలేదు. ఇంతలోనే నీరవ్ మోదీ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె సదరు కంపెనీతో ఉన్న కాంట్రాక్ట్‌ను రద్దు చేసేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment