
ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్‌ని హాలీవుడ్ ప్రముఖులతో పాటు మన ప్రియాంకా చోప్రా కూడా ప్రకటించాల్సి ఉండగా అది జరగలేదు. నటుడు–దర్శకుడు ఆండీ సెర్కిస్, నటి టిఫ్ఫనీ హ్యాడిష్ నామినేషన్స్ ప్రకటించారు. ప్రియాంకా చోప్రా ఒక వీడియో ద్వారా ఉత్తమ సినిమాటోగఫ్రీ విభాగంలో నామినేషన్ దక్కించుకున్న వారి గురించి పేర్కొన్నారు. అంతే.. అదే వీడియోలో సల్మా హయక్, మిచెల్లీ రోట్రిగ్యూజ్, రెబెల్ విల్సన్ వంటి హాలీవుడ్ స్టార్స్ ఉన్నారు. కాగా, ప్రియాంకా చోప్రా సన్ డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో బిజీగా ఉన్నారు. ‘బేవాచ్’ తర్వాత ఆమె హాలీవుడ్‌లో మరో చిత్రం చేస్తున్నారు. ‘ఎ కిడ్ లైక్ జేక్’ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికే ఆమె అక్కడికి వెళ్లారు.
ఈ ఫెస్టివల్ యూఎస్‌లో జరుగుతోంది. నామినేషన్స్ ప్రకటించింది కూడా యూఎస్‌లోని లాస్ ఏంజిల్స్‌లోనే. కాకపోతే సన్ డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్నది న్యూయార్క్‌లో. అక్కణ్కుంచి లాస్ ఏంజిల్స్‌కి ఫ్లైట్‌లో వెళ్లినా కనీసం ఐదు గంటలు పడుతుందట. ఆ టైమ్ కేటాయించలేక నామినేషన్ అనౌన్స్‌మెంట్‌కి ప్రియాంక వెళ్లలేకపోయారని తెలుస్తోంది. అందుకే, వీడియోను విడుదల చేశారని సమాచారం. ఆ వీడియోలో ఇలా కనిపించి అలా మాయమయ్యారు ప్రియాంక.
Comments
Please login to add a commentAdd a comment