
మంచు విష్ణు(Manchu VIshnu ) ప్రస్తుతం కన్నప్ప(kannappa) సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. వచ్చే నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో మంచు విష్ణు దేశం మొత్తం చుట్టేస్తున్నాడు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని యూట్యూబ్ ఛానళ్లకి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో సినిమాతో పాటు తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. తనపై వస్తున్న ట్రోలింగ్ కూడా స్పందించాడు. కన్నప్ప టీజర్‌కు తమిళ, కన్నడ, మలయాళంలో మంచి రెస్పాన్స్ వచ్చిందని, తెలుగులో మాత్రం 15-20 శాతం మంది పని గట్టుకొని ట్రోలింగ్ చేస్తున్నారని మండి పడ్డారు.ఈ నెగటివిటీ కావాలని చేస్తున్నదే అని ఆయన ఆరోపించారు. తనపైనే కాదు రాజమౌళి లాంటి వారిపై కూడా వీళ్లు ఇలానే ట్రోలింగ్ చేస్తారని చెప్పారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR)కి ఆస్కార్ అవార్డు వస్తే తెలుగువారంతా గర్వంగా కాలర్ ఎగరేసి ఎంజాయ్ చేశారు. కానీ కొంతమంది మాత్రం విమర్శించారు. ఆ స్థాయిలో డబ్బులు ఖర్చు పెడితే వస్తది కదా అన్నారు. నేను 200 కోట్లు ఇస్తా.. ఆ విమర్శలు చేసినవాళ్లు ఆస్కార్ తీసుకొస్తారా? ఆర్‌ఆర్‌ఆర్`కి ఆస్కార్ రావడమనేది ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ మూమెంట్.అసలు ఎంత మందికి అక్కడ ఇన్విటేషన్ ఉంటుంది. ఇలాంటి మూమెంట్లని గర్వించాలి. కాలర్ ఎగరేసుకోవాలి. భారతదేశంలో ఎవరూ ఇలాంటి ఘనత సాధించలేదు. ఇండియాలో డైరెక్ట్ గా ఏ సినిమాకి ఆస్కార్ రాలేదు. సత్యజిత్ రేకి గౌరవంగా లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ పురస్కారం అందించారు తప్పితే, సినిమాలకు ఇవ్వలేదు. ఇండియాలో ఇండియా టెక్నీషియన్లు చేసిన ఏ మూవీకి ఆస్కార్ రాలేదు. కేవలం `ఆర్‌ఆర్‌ఆర్`కి మాత్రమే సాధ్యమైంది. మన తెలుగు పాటని ఆస్కార్ స్టేజ్ పై వేశారు, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. దానికన్న గొప్పతనం ఏం కావాలి?అని ట్రోలర్స్‌పై మంచు విష్ణు మండిపడ్డారు.
ఇక కన్నప్పలోని ‘లవ్ సాంగ్’ పై వస్తున్న ట్రోలింగ్ గురించి స్పందిస్తూ.. ‘నేను సినిమా తీస్తున్నా.. డాక్యుమెంటరీ కాదు. అందుకే అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment