ఇన్నర్‌వ్యూ సండే స్పెషల్‌ | Innerview Sunday Special With Actress | Sakshi
Sakshi News home page

ఇన్నర్‌వ్యూ సండే స్పెషల్‌

Published Sun, Oct 13 2019 12:17 AM | Last Updated on Sun, Oct 13 2019 12:17 AM

Innerview Sunday Special With Actress - Sakshi

నాకు ఎంగేజ్‌మెంట్‌ కాలేదు
సోషల్‌ మీడియాలో అభిమానులు అడిగే ప్రశ్నలను పట్టించుకోరు నిధీ అగర్వాల్‌. అయితే ఒక అభిమాని అడిగిన ప్రశ్నను మాత్రం ఆమె పట్టించుకోక తప్పలేదు. నిధి ఆన్‌లైన్‌ పేజీలోని రిలేషన్‌షిప్‌ స్టాటస్‌లో ‘ఎంగేజ్డ్‌’ అని ఉండడం చూసి అవాక్కయిన ఆ అభిమాని ఆ స్టాటస్‌ను స్క్రీన్‌ షాట్‌ తీసి పోస్ట్‌ చేశాడు. ‘‘మీకు ఎంగేజ్‌మెంట్‌ అయిందా!’’ అని షాక్‌ తిన్నట్లుగా అడిగాడు.

దానికి సమాధానంగానే నిధి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఎంగేజ్‌మెంట్‌ కాలేదు’ అని రెస్పాండ్‌ అయ్యారు. కాలేదన్న విషయానికి ఆ అభిమాని ఎంతగా సంతోషించాడో కానీ, అభిమానులు తనను ఇంతగా ఫాలో అవుతున్నందుకు మేఘాల్లో తేలిపోయారు నిధి. నిధికి ఇన్‌స్టాగ్రామ్‌లో 40 లక్షల 10 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.
– నిధీ అగర్వాల్, (మోడల్, డాన్సర్, బాలీవుడ్‌ నటి)

పచ్చడుంటే చాలు
‘‘పచ్చడి అంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. పచ్చడి లేకుండా ముద్ద గొంతు దిగదు. భోజనంలోకి మాత్రమే కాదు.. ఎందులోకైనా నాకు పచ్చడి ఉండాల్సిందే. శాండ్‌విచ్‌లోకి కూడా! చీజ్‌ శాండ్‌విచ్‌లోకైతే మామిడి కాయ పచ్చడి భలేగుంటుంది. మంచి కాంబినేషన్‌. ఏ దేశం వెళ్లినా నాకు ఈ అలవాటు పోదు.

– ప్రియాంక చోప్రా, (‘ఈస్ట్‌ ఇండియా కామెడీ’ గ్రూపుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో)

మూడుసార్లు వెనక్కి
‘‘నా బుగ్గలు బూరెల్లా ఉన్నాయని, ఒళ్లు బొద్దుగా ఉందని మొదట నన్ను ఈ సీరియల్‌కి తీసుకోలేదు. ఇవే కారణాలతో ఆడిషన్‌లో మూడుసార్లు ఫెయిల్‌ అయి వెనక్కి వచ్చేశాను. నాలుగోసారి మాత్రమే నన్ను అదృష్టం వరించింది. అప్పటికి కొంచెం సన్నబడినట్లున్నాను. లైఫ్‌లో ఏదీ ఆశించిన వెంటనే దగ్గరకు వచ్చేయదు. ఓర్పు ఉండాలి. నా మొదటి పారితోషికం 300 రూపాయలు. ఒక క్యాటలాగ్‌ షూట్‌లో పాల్గొన్నందుకు ఇచ్చారు. ఆ మూడొందలు ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. 

– రీమ్‌ షేక్, (జీటీవీలో ఏడాదిగా ప్రసారం అవుతున్న
‘తుఝే హై రాబ్తా’ సీరియల్‌లో కల్యాణీ మల్హర్‌ పాత్రధారి)

థ్యాంక్యూ
‘‘గాలిలో కాలుష్యం ఎక్కువైంది. ఊహిస్తుంటేనే భయంగా ఉంది. స్వచ్ఛమైన గాలి కోసం ప్రతి ఒక్కరం మన బాధ్యతగా చెట్లు పెంచాలి. థ్యాంక్స్‌ వరుణ్‌
తేజ్‌ గారూ.. ఈ పనికి నన్ను ప్రేరేపించినందుకు’’.


– సాయిపల్లవి (వరుణ్‌తేజ్‌ ఇచ్చిన ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ని స్వీకరించి మొక్కను నాటాక సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన కామెంట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement