
ప్రియాంక చోప్రా
సాక్షి, హైదరాబాద్ : భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మళ్లీ పప్పులో కాలేసింది. పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేదిని ఓ ట్వీట్‌కు జత చేయబోయిన కాంగ్రెస్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను ట్యాగ్ చేసింది. భూ పరీక్షల ల్యాబ్‌ల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబద్దాలు చెబుతున్నారని, రైతులకు ఆయా ల్యాబ్‌ల నుంచి ఇస్తున్న భూ పరీక్ష రిపోర్టులు తప్పనే ఆరోపణలు చేస్తూ గురువారం ఆ ట్వీట్ చేసింది.
యూపీఏ హాయాంలో 1141 భూ పరీక్షా కేంద్రాలు ఉన్నట్లు చెబుతూ ప్రియాంక చతుర్వేదిని ట్యాగ్ చేయబోయి, ప్రియాంక చోప్రాను ట్యాగ్ చేసింది. దాంతో ట్విట్టర్‌లో కాంగ్రెస్‌పై జోకులు పేలాయి. వాటితో నాలుక్కరచుకున్న పార్టీ సదరు ట్వీట్‌ను డిలీట్ చేసింది. కొద్దిరోజుల క్రితం ఐదేళ్ల కిందట ప్రధాని మోదీ మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ పోస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ట్విట్టర్‌లో ఆ పార్టీ క్షమాపణలను కూడా కోరింది.
Comments
Please login to add a commentAdd a comment