
సల్మాన్ ఖాన్ ఇటీవల ‘భారత్’కు గుమ్మడికాయ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈ ఏడాది రంజాన్‌కు విడుదల కానుంది. మరి.. నెక్ట్స్ సినిమాకు సల్మాన్ కొంచెం గ్యాప్ తీసుకుంటారా? అంటే లేదు. త్వరలో ‘దబాంగ్ 3’ని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో సోనాక్షీ సిన్హా కథానాయికగా నటిస్తారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తారు. ఏప్రిల్ మొదటివారంలో ఈ సినిమా చిత్రీకరణ మధ్యప్రదేశ్‌లో ప్రారంభం కానుంది. అలాగే సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబర్‌లో స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట చిత్రబృందం. ఇందులో హీరోయిన్‌గా ప్రియాంకా చోప్రాను తీసుకుకోవాలని భావించారట టీమ్. కానీ ‘భారత్’ సినిమాలో కథానాయికగా ప్రియాంక తప్పుకున్నారు. అందుకని ఆమెను హీరోయిన్‌గా తీసుకోవడానికి అభ్యంతరం తెలుపుతున్నారట సల్మాన్. పెళ్లి కారణంగా, హాలీవుడ్ సినిమాల వల్ల ‘భారత్’ నుంచి తప్పుకుంటున్నానని ప్రియాంక వివరణ ఇచ్చినప్పటికీ సల్మాన్‌కి కోపం తగ్గనట్లుంది.
Comments
Please login to add a commentAdd a comment