
బాలీవుడ్ స్టార్స్ గురించిన వ్యక్తిగత విషయాలు.. ఈ వారం వారే చేస్తున్నారో తెలుసుకోవాలన్న కోరిక అభిమానులకు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు.. షూటింగ్ లేని సమయాల్లో ఏం చేస్తుంటారు? పిల్లలతో సమయాన్ని ఎలా స్పెండ్ చేస్తారన్న విషయం తెలుసుకేందుకు ఉత్సాహం చూపిస్తారు. అదే సమయంలో బాలీవుడ్ స్టార్స్.. కూడా తమతమ వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు.. ఈ వారం అలా ఫరాన్ అక్తర్, షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా తదితరుల తమ పర్సనల్ లైఫ్‌ని షేర్ చేసుకున్నారు.. ఆ వివరాలు మీ కోసం.
ఫరాన్ అక్తర్
వీలు చిక్కితే చాలు.. ఫరాన్ అక్తర్ తన ఇద్దరు కుమార్తెలు శాక్య, అకీరాలతో సమయాన్ని గడిపేస్తారు. వారితో గడిపిన క్షణాలను ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటారు. తాజాగా చిన్న కుమార్తె అకీరాతో గడిపిన క్షణాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు ఇప్పటి వరకూ 55 వేల లైకులు వచ్చాయి.
షాహిద్ కపూర్
ఈ మధ్యే తండ్రి అయిన షాహిద్ కపూర్.. తన ముద్దులబిడ్డ మిషా కకూర్‌ను ఎత్తుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు 7 లక్షలకు పైగా లైకులు.. వచ్చాయి.
ప్రియాంక చోప్రా
క్వాటికోతో హాలీవుడ్‌లో కూడా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. సోషల్ మీడియాను వాడుకోవడంలో చాలా ముందుంటారు. తాజాగా ప్యాటీ జెన్‌కిన్స్, ఆక్టివా స్పెన్సర్, కెల్లీ క్లార్క్‌సన్, మిషెల్లీ పిఫర్‌లతో కలిసి ప్రియాంక చోప్రా పవర్ ఉమెన్ అనే కార్యక్రమానికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోను ఇప్పటి వరకూ 3 లక్షలమంది లైక్ చేశారు.
షారుఖ్ ఖాన్
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. ఈ శనివారం పాత స్నేహితులతో అంటూ ఒక ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో ఫరాఖాన్, ఆనంద్ ఎల్ రాయ్, హిమాంషు శర్మ, కరణ్ జోహార్ తదితరలు ఉన్నారు. ఈ ఫొటోను ఇప్పటివరకూ 28 వేల మంది లైక్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment