వారికి సాయం చేయండి: విరుష్క | Virat, Anushka Helped Flood Victims In Bihar and Assam | Sakshi
Sakshi News home page

వారికి సాయం చేయండి: విరుష్క

Published Fri, Jul 31 2020 9:20 AM | Last Updated on Fri, Jul 31 2020 9:22 AM

Virat, Anushka Helped Flood Victims In Bihar and Assam - Sakshi

విరుష్క వీరు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, సమాజంలో జరిగే విషయాలపై స్పందిస్తూ ఉంటారు. తాజాగా అనుష్క శర్మ బిహార్‌, అస్సాం వరదలలో చిక్కుకున్న వారికి సాయం చేయండి అంటూ పిలుపునిచ్చారు. తాము కూడా వరద బాధితులకు సాయం చేస్తున్న ఆర్గనైజేషన్స్‌కు తోడుగా నిలుస్తున్నామని చెప్పారు. రాపిడ్‌ రెస్పాన్స్‌, యాక్షన్‌ ఎయిడ్‌, గూంజ్‌ ఈ మూడింటి ద్వారా బిహార్‌, అస్సాం వరదలలో చిక్కుకున్న వారికి సాయం చేస్తున్నామని చెప్పారు. దీనికి  సంబంధించి ఒక పోస్ట్‌ను అనుష్క తన సోషల్‌మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. ఆ మూడు స్వచ్చంధ సంస్థల లింక్‌లను కూడా షేర్‌ చేశారు. సాయం చేయాలనుకున్న వారు వీటి ద్వారా విరాళాలు అందించవచ్చని తెలిపారు. ‘కరోనాతో దేశం అల్లాడిపోతుంటే మరోవైపు బిహార్‌, అ‍స్సాం ప్రజలు వరదలలో చిక్కుకుకొని విలవిలలాడుతున్నారు. మూడు ఆర్గనైజేషన్‌లు వారికి సహాయచర్యలు అందిస్తున్నాయి. మేం వారికి అండగా ఉంటున్నాం. మీరు కూడా  ఈ సంస్థల ద్వారా సాయాన్ని అందించండి’ అని సోషల్‌మీడియా వేదికగా కోరారు.   

ఇక మరోనటి గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా కూడా వరద బాధితులకు తాను, తన భర్త నిక్‌జోనస్‌ విరాళాలు అందించినట్లు తెలిపింది. తాను పుట్టిన బిహార్‌తో పాటు, అస్సాం కూడా భారీగా కురిసే వరదల్లో చిక్కుకుందని చెప్పారు. ‘మేం సాయం చేశాం. ఇప్పుడు ఇక మీ వంతు’ అంటూ ప్రియాంక ట్వీట్‌ చేశారు. మే 22 నుంచి  అస్సాం, బిహార్‌లను వరదలు ముంచెత్తుతున్నాయి. అస్సాంలో 16.8 లక్షల మంది వరద బాధితులు ఉండగా, బిహార్‌లో 30 లక్షల మందికి పైగా ఈ వరదల వల్ల ప్రభావితం అయ్యారు. 

చదవండి: బిహార్‌కు మరో చేదు వార్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement