న్యూయార్క్: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సినిమాల్లోనే కాకుండానే వ్యాపారం రంగంలోను దూసుకుపోతున్నారు. తాజాగా ఆమె న్యూయార్క్‌లో ‘సోనా’ అనే రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఇది ఈ నెల చివరి వరకు అందరికీ అందుబాటులోకి రానుందని ప్రియాంక తెలిపారు. భర్త నిక్ జోనస్, తల్లి మధుచోప్రాలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కొత్త రెస్టారెంట్‌కు ప్రముఖ చెఫ్ హరినాయక్ ప్రధాన చెఫ్‌గా ఉంటారని పేర్కొన్నారు.
అనేక వెరైటీల ద్వారా రుచికరమైన భారత రుచులను అందించేందుకు థ్రిల్‌గా ఫీలవుతున్నట్లు చెప్పారు. ఈ రెస్టారెంట్‌ను తన మిత్రులు మనీష్ గొయల్, డేవిడ్ రాబిన్ చూసుకొంటారన్నారు. కాగా, ప్రియాంకకు కుటుంబ సభ్యులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇదిలా వుంటే ప్రియాంక చోప్రా ప్రస్తుతం 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్‌ను లండన్‌లో చిత్రీకరిస్తోంది. ఇక ప్రియాంక ఇప్పటికే నటి, నిర్మాత, గాయనిగానూ మంచిపేరు గడించిన విషయం తెలిసిందే!
Comments
Please login to add a commentAdd a comment