న్యూయార్క టైమ్స్ 2024 ఏడాదికి న్యూయార్క్ నగరంలో చక్కగా తినేందుకు అత్యుత్తమమైన రెస్టారెంట్ల జాబితాలను విడుదల చేసింది. న్యూయార్క్‌లో రెస్లారెంట్లపై అభిరుచిగల పీట్‌వెల్స్ అనే ప్రముఖ వ్యక్తి ఈ వంద అత్యుత్తమ బెస్ట్ రెస్టారెంట్ల జాబితాను ఎంపిక చేశారు. వాటిలో భారతీయ వంటకాలను అందించే నాలుగు రెస్టారెంట్లకు చోటు దక్కడం విశేషం. ఆ అత్యుత్తమ రెస్టారెంట్లలలో గ్రీన్‌విచ్ విలేజ్‌లో ఉండే సెమ్మా అనే రెస్టారెంట్ టాప్ 10లో ఏడో స్థానంలో ఉంది.
గతేడాది ఇదే రెస్టారెంట్ 12వ స్థానంలో ఉంది. ఈ సెమ్మా రెస్టారెంట్‌ని చెఫ్ విజయకుమార్ నిర్వహిస్తున్నారు. ఆయన మంచి సౌత్ ఇండియన్ వంటకాలను అందిస్తున్నారు. అలాగే మాన్‌హట్టన్ దిగువ తూర్పు వైపునున్న ధమాకా 54వ స్థానంలో ఉంది. దీనికి చెఫ్ భాగస్వామి చింతన్ పాండ్యా , రెస్టారెంట్ రోనీ మజుందార్ కలిసి నిర్వహిస్తున్నారు. క్వీన్స్‌లోని టెంపుల్ క్యాంటీన్ 80వ స్థానంలో నిలిచింది. ఇది హిందూ దేవాలయం నేలమాళిగలో ఉంది. ఇది సంప్రదాయ దక్షిణాది వంటకాలను అందిస్తుంది.
మిడ్‌టౌన్ మాన్‌హట్టన్‌లోని హైదరాబాదీ జైకా న్యూయార్క్ నగరంలోని టాప్ 100 ఉత్తమ రెస్టారెంట్‌లలో చివరి భారతీయ రెస్టారెంట్. ఇది 95వ స్థానంలో ఉంది. ఇది బిర్యానీలకు ప్రత్యేకత గాంచిన రెస్టారెంట్. ఈ మేరకు పీట్ వెల్స్ అత్యుత్తమ రెస్టారెంట్‌ల జాబితా తోపాటుగా చివర నోట్‌లో ఇలా రాశాడు. అందులో.."న్యూయార్క్ ఒక పెద్ద నగరం. ఇక్కడ ప్రజలు తమ పరిసరాలకు సమీపంలో మంచి రెస్టారెంట్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేలా ఈ టాప్ 100 బెస్ట్ రెస్టారెంట్ల జాబితాను లిస్ట్ చేశాను. ఈ జాబితాతో కావాల్సిన వంటకాలు దొరికే రెస్టారెంట్‌లు ఏంటో కూడా ఈజీగా తెలుసుకోగలరు. చక్కగా రుచులను ఆస్వాదించగలరు అని రాశారు పీట్ వేల్స్.
(చదవండి: యంగ్ హీరోలకు ధీటుగా మాధవన్.. ఫిట్‌నెస్ రహస్యం ఇదే!)
Comments
Please login to add a commentAdd a comment