‘లవ్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ అంటున్న ప్రియాంక చోప్రా | Priyanka Chopra Wishes Her Husband Nick Jonas | Sakshi
Sakshi News home page

Priyanka Chopra and Nick Jonas: భర్త నిక్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రియాంక

Published Fri, Sep 17 2021 11:31 AM | Last Updated on Fri, Sep 17 2021 11:57 AM

Priyanka Chopra Wishes Her Husband Nick Jonas - Sakshi

బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్‌ నటుడు, సింగర్‌ నిక్‌ జోనస్‌ 2018లో వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. ఈ జంట ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమని ఎప్పటికప్పుడూ సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ప్రియాంక తన భర్త నిక్‌పై తనకున్న ప్రేమని మరోసారి బయటపెట్టింది.

శుక్రవారం (సెప్టెంబర్‌ 17న) నిక్‌ పుట్టిన రోజు సందర్భంగా వారిద్దరూ కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్‌ చేస్తూ.. ‘లవ్‌ ఆఫ్‌ మై లైఫ్‌. అత్యంత దయ, ప్రేమ ఉన్న వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఐ లవ్‌ యూ బేబీ’ అంటూ ప్రియాంక నిక్‌పై తనకున్న ప్రేమని వ్యక్తపరిచింది. చూడచక్కని ఈ జంటను చూసి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. మీరెప్పుడూ ఇలాగే నవ్వుతూ, సంతోషంగా ఉండాలంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇటీవలే ప్రియాంక ఓ ఇంటర్వూలో  మాట్లాడుతూ.. ‘నిక్‌ ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. అనవసరంగా మాట్లాడడు. అతను నన్ను ఎంతో ప్రభావితం చేశాడు. అతని వల్లే మిర్చిలాగా ఘాటుగా ఉండే నేను ఎంతో కూల్‌గా మారిపోయాను’ అని తెలిపింది. కాగా ప్రస్తుతం యూకేలో సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ కేవలం భర్త పుట్టినరోజును సెలబ్రేట్‌ చేసేందుకు అమెరికా వచ్చింది. ప్రస్తుతం ఈ భామ ‘ది మ్యాట్రిక్స్: ది రిసరక్షన్స్‌’ అనే హాలీవుడ్‌ మూవీ నటిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement