నా పెళ్లికి ఈ కానుకలే తీసుకురండి.. | Priyanka Chopra Release Wedding Gift Registry In Amazon | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 22 2018 12:08 PM | Last Updated on Thu, Nov 22 2018 12:08 PM

Priyanka Chopra Release Wedding Gift Registry In Amazon - Sakshi

బాలీవుడ్‌లో పెళ్లిల్ల సీజన్‌ జోరుగా సాగుతుంది. ప్రస్తుతం బీటౌన్‌ అంతా దీప్‌వీర్‌ల పెళ్లి ముచ్చట్లలో మునిగిపోయింది. ఈ హాడావుడి కాస్తా తగ్గేలోపే మరో చక్కనమ్మ పెళ్లి పీటలెక్కనుంది. దాంతో బీటౌన్‌లో మరో పది రోజుల పాటు పెళ్లి వార్తలు తప్ప మరేం వినిపంచే అవకాశం లేదు. దీప్‌వీర్‌ల పెళ్లి సందడి ముగిసేలోపే ప్రియాంక​ చోప్రా - నిక్‌ జోనాస్‌ల పెళ్లి సంబరాలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే వీరి వివాహ ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నెలాఖరున సంగీత్‌, మెహందీ వేడుకలు, డిసెంబరు 3న పెళ్లి ఘనంగా జరగనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ను ప్రియాంక - నిక్‌లు తమ వివాహానికి వేదికగా ఎంచుకున్నారు. నిన్నటి దాకా వీరి పెళ్లి కార్డ్‌కు సంబంధించిన వార్తలు హల్‌చల్‌ చేస్తే.. నేడు ప్రియాంక రిలీజ్‌ చేసిన గిఫ్ట్‌ రిజిస్టరి హాట్‌ టాపిక్‌ అయ్యింది. 

తమ పెళ్లికి వచ్చే అతిథులు కానుకలు ఇవ్వాలనుకుంటే తాను సూచించిన జాబితాలోని వస్తువులను ఇస్తే సంతోషమని ప్రియాంక తెలిపింది. అందుకోసం అమెజాన్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్‌లో తాను కోరుకుంటున్న వస్తువుల జాబితాతో కూడిన ఓ లిస్ట్‌ని కూడా విడుదల చేసింది. ఈ జాబితాలో కిచెన్‌లోకి అవసరమైన చెంచాలు, ఫోర్కులు, డిన్నర్‌ ప్లేట్లు, వైను గ్లాస్‌లు మొదలుకొని డంబెల్స్‌ లాంటి వ్యాయామ సామగ్రి,  ట్రావెల్‌ బ్యాగులు, పరుపులు, తలగడలు, టూత్‌ బ్రష్‌ల్లాంటివి ఉన్నాయి. సుమారు రూ.1.70 లక్షల విలువైన ఓ ఎల్‌ఈడీ టీవీ కూడా ఈ కానుకల లిస్ట్‌లో ఉంది. వీటితో పాటు తన పెంపుడు కుక్క డయానా కోసం కూడా గిఫ్ట్‌లు తీసుకురావొచ్చని తెలిపింది ప్రియాంక.

డయానా కోసం గులాబీ రంగు నెక్‌ కాలర్‌, రెయిన్‌ కోట్‌, పెట్‌ బెడ్‌, పెట్‌ జీపీఎస్‌ ట్రాకర్‌లను కూడా కానుకలుగా తీసుకురావొచ్చని జాబితాలో పేర్కొంది. ఇలా అతిథుల  కానుకల కోసం ముందే రిజిస్ట్రీ ప్రకటించడం మన దగ్గర కొత్త కానీ విదేశాల్లో మామూలు విషయమే. ఇంత గొప్ప స్టార్‌ అయి ఉండి ఇలా కానుకలు తీసుకురండి అని కోరడం ఏంటని ఆశ్యర్యపోకండి. ప్రియాంక ఇలా గిఫ్ట్‌లు అడగడం వెనుక ఓ సదుద్దేశం ఉంది. ప్రియాంక పెళ్లి కానుకల అమ్మకాల ద్వారా అమెజాన్‌కు ఆదాయం వస్తుంది కాబట్టి ఆ సంస్థ ఓ లక్ష డాలర్లను యునిసెఫ్‌కు విరాళంగా ఇవ్వనుందట. ఈ విషయం గురించి ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. ప్రసుత్తం ప్రియాంక యునిసెఫ్‌కు ప్రచారకర్తగా ఉన్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement