
ముంబై : బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌లు రెండవ వివాహ వార్సికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక బెస్ట్ ఫ్రెండ్ తమన్నా దత్తా వీరికి యానివర్సిరీ విషెస్ తెలియజేస్తూ..ఎల్లప్పుడూ ప్రేమతో, సంతోషంగా ఉండండి అంటూ వారి పెళ్లిరోజు ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.ప్రేమ పక్షులుగా ఉన్న నికియాంకలు(నిక్ జోనాస - ప్రియాంక చోప్రా)లు 2018 డిసెంబర్1న పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. క్రైస్తవ సంప్రదాయంతో పాటు భారతీయ సంప్రదాయాన్ని కూడా ఆచరించి రెండు సార్లు వివాహం చేసుకున్నారు. (నా భర్త, గోడ సాయం తీసుకున్నా: అనుష్క)
డిసెంబర్1న జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం,ఆ మరుసరి రోజు డిసెంబర్ 2న భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అంతేకాకుండా న్యూఢిల్లీ, ముంబై రెండు చోట్ల వివాహ రిసెప్షన్‌ను గ్రాండ్‌గా జరుపుకున్నారు.సినిమాల విషయానికి వస్తే.. ప్రియాంక చివరగా స్కై ఈజ్ పింక్ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత ఆమె నటించిన వైట్ టైగర్, రాజ్‌కుమార్ రావు, ఆదర్ష్ గౌరవ్ సినిమాలు విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా బ్రేక్ పడింది. అంతేకాకుండా ప్రియాంక హాలీవుడ్ మూవీలో నటించబోతున్నారు. 2016 జర్మన్ భాషా చిత్రం ఎస్ఎంఎస్ ఫర్ డిచ్ రీమేక్ లో నటించే అవకాశం దక్కించుకున్నారు. (కేజీయఫ్ కాంబినేషన్‌లో ప్రభాస్ ప్యాన్ ఇండియా)
Comments
Please login to add a commentAdd a comment