గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ బర్త్‌డేకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. అతని పుట్టినరోజు వేడుకలను ఏకంగా ప్రత్యేక జెట్‌లో ప్లాన్ చేసింది. ఇవాళ నిక్ 30వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా బర్త్‌డే వేడుకల కోసం ప్రైవేట్ జెట్‌ను వేదికగా మార్చింది. ఈ సందర్భంగా సింగర్ నిక్ జోనాస్ తన ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేశారు. ఈ వీడియో ప్రియాంక చోప్రా స్పెషల్ జెట్‌లో కూర్చొని భర్తకు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పింది. అయితే ఈ వేడుక ఎక్కడ నిర్వహించారనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. వేడుకలకు ముందు ప్రియాంక తన హ్యాండిల్‌పై ఫోటోను కూడా పంచుకుంది.
(చదవండి: Priyanka Chopra: క్లిష్ట పరిస్థితులు చూశాం, మా కూతురు తిరిగొచ్చింది)
కాగా నిక్, ప్రియాంక 2018 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. రాజస్తాన్‌లోని ఓ రాజభవనంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరిగాయి. క్రిస్టియన్ పద్ధతిలో ఓసారి, హిందూ సంప్రదాయంలో మరోసారి వీరి పెళ్లి జరిపించారు. ఆ తర్వాత సరోగసి ద్వారా ప్రియాంక- నిక్ జోనస్ దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తమ గారాల పట్టికి ‘మాల్టీ మేరీ చోప్రా జోనస్’అని నామకరణం కూడా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment