
'స్కై ఈజ్ పింక్' సినిమా సీన్ చూసి తన భర్త నిక్ జొనాస్ కన్నీరు పెట్టుకున్నారని బాలీవుడ్ అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రా తెలిపారు. షోనాలీ బోస్ దర్శకత్వం వహించిన ' స్కై ఈజ్ పింక్' చిత్రంలో ఫర్హాన్ అక్తర్, జైరా వసీం కీలక పాత్రలు పోషించారు. చిన్నప్పుడే అరుదైన వ్యాధికి గురై 15 ఏళ్లకే మంచి వక్తగా, కవయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న అయిషా చౌదరీ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ నెల 13న టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో 'స్కై ఈజ్ పింక్' సినిమాను ప్రదర్శించనున్నారు.
కాగా గతేడాది డిసెంబర్‌లో తన పెళ్లికి నాలుగు రోజుల ముందు ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయిందని ప్రియాంక తెలిపారు. 'నా పెళ్లికి నాలుగు రోజులు ముందు స్కై ఈజ్ షూటింగ్‌లో ఉన్నాను. పెళ్లి పనులు మొత్తం సెట్ నుంచే చూసుకున్నాని, దానికి మా నిర్మాతలు సహకరించారని పేర్కొన్నారు. ఆరోజు క్లైమాక్స్ షూట్ తర్వాత కేక్ పార్టీ ఉండడంతో మా టీంతో కలిసి నిక్‌ను ఆహ్వానించాము. కానీ నిక్ ముందుగానే రావడం, అదే సమయంలో మేము సినిమాకు సంబంధించి ఒక బలమైన సీన్ చేస్తున్నాం. నా పక్క నుంచి ఏదో శబ్దం వినపించడంతో, వెంటనే పక్కకు తిరిగి చూడగా.. ఆ సమయంలో నిక్ ఏడుస్తూ కనిపించాడని' ప్రియాంక పేర్కొన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న డైరక్టర్ బోస్ స్పందిస్తూ.. '' ప్రియాంక ! నువ్వు నీ భర్తని ఏడిపించేశావు. నిజంగా ఇది చాలా గొప్ప సీన్ అని'' పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment