Reason Behind Why Priyanka Chopra Removes Husband Nick Jonas Name - Sakshi
Sakshi News home page

Priyanka Chopra- Nick Jonas: ప్రియాంక తన భర్త పేరు అందుకే తొలగించిందట!

Published Thu, Nov 25 2021 10:39 AM | Last Updated on Thu, Nov 25 2021 12:21 PM

Reason Behind Why Priyanka Chopra Removes Husband Nick Jonas Name - Sakshi

Because of This Reason Priyanka Chopra Delete Her Husband Nick Jonas Name: సోషల్‌ మీడియా ఖాతాల నుంచి గ్లోబర్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా తన భర్త నిక్‌ జోనస్‌ ఇంటి పేరు తొలగించడం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రియాంక చోప్రా జోనస్‌ అని ఉండే తన ప్రోఫైల్‌ నేమ్‌లో ప్రియాంక అని మాత్రమే ఉంచి చోప్రా, జోనస్‌ పేర్లు తీసేసింది. అది చూసి అందరూ షాక్‌కు గురయ్యారు. అచ్చం ఇలాంటి సంఘటనే టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ నాగ చైతన్య-సమంత మధ్యలో జరగడంతో అందరూ ప్రియాంక-నిక్‌ కూడా త్వరలో విడాకులు తీసుకోబోతున్నారా? అనే ఊహాగానాలే రెకిత్తించారు. దీంతో ప్రియాంక తల్లి మధు చోప్రా ఈ వార్తల్లో నిజం లేదని, ప్రియాంక-నిక్‌లు చాలా సంతోషంగా ఉన్నారంటూ స్పష్టం చేసింది. 

చదవండి: నిక్‌ జొనాస్‌పై ప్రియాంక వీడియో.. రూమర్స్‌కు చెక్‌

అలాగే ప్రియాంక సైతం ఓ వీడియో షేర్‌ చేయడంతో పాటు భర్త షేర్‌ చేసిన వీడియోకు కామెంట్‌ పెట్టి రూమార్లకు చెక్‌ పెట్టింది. మరి అలాంటప్పుడు తన పేరు పక్కన నిక్‌ ఇంటి పేరు ఎందుకు తొలగించినట్లు అనే ప్రశ్నలు లెవనెత్తుతున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో పలువురు దీనికి కారణం ఇదేనంటూ చెప్పుకొస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో చాలా మంది జ్యోతిష్య శాస్త్రాన్ని, న్యూమ‌రాల‌జీని మంది న‌మ్ముతున్నారు. అందులో భాగంగానే ప్రియాంక తన భర్త ఇంటి పేరు తొలగించిందని చెబుతున్నారు. న్యూమరాలజీ ప్రకారం తన పేరు పక్కన చోప్రా, జోనాస్ అనే ప‌దాలు కలిసి రావని, వాటిని తీసేస్తే న్యూమ‌రాల‌జీ, ఆస్ట్రాల‌జీ ప్ర‌కారం లైఫ్ బాగుంటుంద‌ట. అందుకే ఆ రెండు ప‌దాల‌ను తొల‌గించినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం.

చదవండి: నిక్‌తో ప్రియాంక విడాకులు? తల్లి మధు చోప్రా క్లారిటీ

అంతేగాక కావాలనే ప్రియాంక పేర్లు తొలగించిందని, ఇది ఓ ఛాలెంజ్‌లో భాగమని మరికొందరూ చెప్పుకుంటున్నారు. ఏదేమైనా కానీ ప్రియాంక ఆ పేర్లు తొలగించడం వెనక ఏదో కారణం ఉండి ఉంటుందంటున్నారు. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాంటే దానికి అసలు కారణం స్వయంగా ప్రియాంక చెప్పేవరకు వేచి చూడాల్సిందే. ఇటీవల నిక్‌-ప్రియాంక సొంత ఇంటిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీపావళి వేడుకలను ఈ జంట సంతోషంగా వారి కొత్త ఇంటిలో జరుపుకున్నారు. అంతేగాక ఎప్పటి లాగే సోషల్‌ మీడియోలో కూడా ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకుంటున్నారు. ఇవన్ని చూస్తుంటే వారి దాంపత్య జీవితం సాఫీగానే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. 

చదవండి: పార్టీలో డ్యాన్స్‌తో హీరోయిన్‌ అక్క రచ్చ, ఛీఛీ.. కొంచం పద్దతిగా ఉండండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement