‘వదినా.. పెళ్లి కూతురికి వాళ్ల అత్తామామలు పెళ్లికి ఏం పెట్టారంటావు? ఎంత బంగారం ఇచ్చారంటావు’ అనే సంభాషణలు కచ్చితంగా మన చెవులకు వినపడుతుంటాయి. మరి ప్రియాంకా చోప్రా పెళ్లికి సంబంధించి కూడా ఇదే డిస్కషన్ నడిచే ఉండొచ్చు. డిసెంబర్ 1, 2 తేదీల్లో నిక్ జోనస్, ప్రియాంకా చోప్రా క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల్లో రాజస్తాన్‌లోని ఉమైద్ ప్యాలెస్‌లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లిరోజు కానుకగా నిక్ జోనస్ తల్లిదండ్రులు ప్రియాంకకు ‘స్నోఫ్లేక్ ఇయర్ రింగ్స్’ను బహుమతిగా ఇచ్చారు.
వాన్ క్లీఫ్, ఆర్పెల్స్ కంపెనీ తయారు చేసిన ఈ చెవి దుద్దులు సుమారు 60 లక్షలు ఖరీదట. మీరు చదివింది కరెక్ట్. కళ్లు రుద్దుకొని చూసినా అవి 60 లక్షల ఖరీదే. టాక్స్ మినహాయించి ఈ ఖరీదని సమాచారం. మంచు బిందువుల ప్రేరణతో ఓ ఫ్రెంచ్ జ్యువెలరీ కంపెనీ ఈ ఇయర్ రింగ్స్ తయారు చేస్తున్నారు. చుట్టూ డైమండ్స్ పొదిగి ఉండటం ఈ రింగ్స్ స్పెషాల్టీ. మరోవైపు క్రిస్టియన్స్ వెడ్డింగ్ రోజు సుమారు 18 అడుగుల కేక్‌ను తయారు చేయించారట నిక్. దానికోసం దుబాయ్, కువైట్ నుంచి స్పెషల్ చెఫ్స్‌ని పిలిపించారు. రెండు పద్ధతుల్లో ఘనంగా పెళ్లి చేసుకున్న ప్రియానిక్ మంగళవారం రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
అత్తగారి ప్రేమ అరవై లక్షలు
Published Wed, Dec 5 2018 12:33 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment