
ప్రియాంకా చోప్రా
ప్రస్తుతం తన ఆలోచనలు రెండు విషయాల మీదే ఉన్నాయి అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా. ఓ హాలీవుడ్ మేగజీన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ– ‘‘ఓ బేబీకి జన్మనివ్వడం, లాస్ ఏంజెల్స్‌లో ఓ ఇల్లు కొనుక్కోవడం అనే విషయాల గురించి ఈ మధ్య ప్లాన్ చేస్తున్నాను. మనమెక్కడ సంతోషంగా ఉంటామో అదే ఇల్లు అని నమ్ముతాను. మనం ప్రేమించే వాళ్లు మన చుట్టూ ఉండాలి.. అంతే’’ అన్నారు. హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రియాంక వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.