‘నేను పీఎం.. మా ఆయన ప్రెసిడెంట్‌’ | Priyanka Chopra For Prime Minister, Nick Jonas For President | Sakshi
Sakshi News home page

‘నేను పీఎం.. మా ఆయన ప్రెసిడెంట్‌’

Jun 3 2019 8:48 PM | Updated on Jun 3 2019 8:52 PM

Priyanka Chopra For Prime Minister, Nick Jonas For President - Sakshi

ఒక వేళ మాకే గనక అవకాశం వస్తే.. నేను భారత దేశానికి  ప్రధానినవుతా.. నా భర్త నిక్‌ జోనాస్‌ తన దేశానికి ప్రెసిడెంట్‌ అవుతారు అంటున్నారు గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా. రాజకీయాలకు దూరంగా ఉండే ప్రియాంక సడెన్‌గా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సండే టైమ్స్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. యూనిసెఫ్‌ ప్రతినిధిగా దేశ విదేశాలు తిరుగుతూ.. తన వంతు సాయం చేసే ప్రియాంక రాజకీయాల గురించి ఎన్నడు కామెంట్‌ చేయలేదు. కానీ తొలిసారి సండే టైమ్స్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక ఈ విషయాన్ని ప్రస్తావించారు.

‘అవకాశం వస్తే నేను భారత ప్రధానిని అవుతా. నా భర్త నిక్‌ అమెరికా అధ్యక్షుడి పదవికి పోటీ చేస్తారు. నాకు రాజకీయాలతో ముడిపడి ఉన్న అంశాలంటే నచ్చవు. కానీ దేశంలో మార్పు రావాలని నేను, నిక్‌ కోరుకుంటున్నాం’ అన్నారు. అయితే ఆమె సరదాగా ఈ వ్యాఖ్యలు చేశారా.. లేక నిజంగానే రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఉందా అన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ప్రియాంక బాలీవుడ్‌లో ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ అనే చిత్రంలో నటించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement