
తండ్రి పౌల్ జోనస్‌తో నిక్ జోనస్ (ఫైల్ ఫోటో)
నిక్ జోనస్ తండ్రి, ప్రియాంక చోప్రా కాబోయే మామగారు.. పౌల్ జోనస్ దివాలా తీశారంటా. పాపం అన్ని అప్పులున్నాయా అంటూ జాలి పడకండి. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆయన కోటిశ్వరుడే. మరి దివాలా తీయడం ఏంటంటే.. పౌల్ జోనస్‌కు ‘న్యూజెర్సి’ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. అయితే ఆ కంపెనీ మీద ఇప్పటికే ఒక మిలియన్ డాలర్ (మన కరెన్సీలో దాదాపు 7 కోట్ల రూపాయలు ) అప్పుతో పాటు కేసు ఉందంట. ప్రస్తుతం కోర్టు తీర్పు అనంతరం మరికొంత సొమ్ము జరిమానాగా చెల్లించాల్సి వస్తున్నట్లు సమాచారం. అందువల్ల పౌల్ జోనస్ ‘న్యూ జెర్సీ’ కంపెనీకి సంభందించిన ఆస్తులను అమ్మడమే కాక దివాలా దస్తావేజు దాఖలు చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
అయితే పౌల్ జోనస్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే ఆయన కుమారులు మాత్రం సంగీత ప్రపంచంలో దూసుకుపోతున్నారు. నిక్ జోనస్ తన సోదరులు జో, కెవిన్‌లతో కలిసి ‘జోనస్ బ్రదర్స్’ అనే మ్యూజిక్ బ్యాండ్‌ని ప్రారంభించారు. కానీ 2013లో విడిపోయి ఎవరికి వారు సొంత విభాగాలను ప్రారంభించి సంపాదించడం మొదలుపెట్టారు. ‘జోనస్ బ్రదర్స్’ నుంచి విడిపోయిన అనంతరం నిక్ సోలో ఆర్టిస్ట్‌గా బాగానే సంపాదించారు. అంతేకాక కేవలం మ్యూజిక్‌కే పరిమితమవ్వకుండా నటన వైపు కూడా దృష్టి సారించారు. ప్రస్తుతం నిక్ ‘జ్యుమాంజీ’ రీమేక్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిక్ ఆస్తి 25 మిలియన్ డాలర్లు మన కరెన్సీ ప్రకారం చెప్పాలంటే 1,76,93,75, 000 రూపాయలు. నిక్ తండ్రి పౌల్ జోనస్ ఆస్తి సుమారు 28 మిలియన్ డాలర్లు అంటే 1,98,14,20,000 రూపాయలు.
Comments
Please login to add a commentAdd a comment