Priyanka Chopra Removes 'Nick Jonas' Surname From Her Instagram Account - Sakshi
Sakshi News home page

Priyanka Chopra And Nick Jonas: భర్త పేరు తొలగించిన ప్రియాంక... అసలేం జరిగింది?

Published Mon, Nov 22 2021 9:20 PM | Last Updated on Tue, Nov 23 2021 8:46 AM

Priyanka Chopra Removes Husband Nick Jonas Surname From Instagram - Sakshi

బాలీవుడ్‌, హాలీవుడ్‌లలో మోస్ట్‌ లవబుల్‌  కపుల్‌ అంటే  గుర్తొచ్చేది  ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్‌ జోడీనే. 2018లో మూడుముళ్ల బంధంతో ఒక్కటైన  ఈ లవ్‌బర్డ్స్‌ ఎపుడూ తమ ప్రేమకు సంబంధించిన విషయాలను ముచ్చటిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ జంటకు సంబంధించిన ఓ సంచలన విషయం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌ ప్రోఫైల్‌ పేరు నుంచి భర్త నిక్‌ జోనస్‌ పేరును తొలిగించింది. దీంతో అది చూసి ఆమె ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌ అంతా షాక్‌కు గురవుతున్నారు.

చదవండి: పునీత్‌ స్టైల్లో ‘నాటు నాటు’ సాంగ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ టీం ఫిదా

అసలేం జరిగింది, నిక్ పేరును ప్రియాంక ఎందుకు తొలగించారంటూ సినీ వర్గాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ చర్చించుకుంటున్నారు. కాగా ఇటీవల టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ నాగ చైతన్య-సమంతలు విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వారి విడాకుల ప్రకటనకు ముందుకు సామ్ తన సోషల్‌ మీడియా ఖాతాలు ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ల్లో అక్కినేని పేరు తొలగించి ఎస్‌ అనే అక్షరం మాత్రమే పెట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రియాంక కూడా తన సోషల్‌ మీడియా ఖాతాల పేర్లను మార్చడంతో ప్రియంక-నిక్‌కు మధ్య కూడా సంబంధం చేడిందా? ఏంటీ? అంటూ ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి.

చదవండి: విడాకుల తర్వాత సమంత తొలి ఇంటర్వ్యూ, ఆసక్తికర విషయాలు వెల్లడి

అయితే ప్రియాంక తన పేరును మార్చడం వెనక అసలు విషయం ఏంటన్నది మాత్రం స్పష్టత లేదు. అసలు ఏమైంది, ఏం జరిగింది.. వారిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారు కదా.. నిన్న, మొన్నటి వరకు వారి వెకేషన్స్‌ సంబంధించిన ఫొటోలను కూడా షేర్‌ చేశారంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ఇటీవల ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ప్రియాంక చోప్రా తన ఎంగేజ్‌మెంట్ రింగ్‌ గురించి, జోనస్‌తో తనకున్న అనుంబంధం గురించి చెబుతూ తెగ మురిసిపోయింది.

చదవండి: ఈ చిన్నారి ఓ స్టార్‌ హీరోయిన్‌, మన అగ్ర హీరోలందరితో జతకట్టింది, ఎవరో గుర్తు పట్టారా?

అంతేగాక నిక్‌ కూడా ఎన్నో సందర్భాల్లో ప్రియాంకపై తన ప్రేమను వ్యక్తం పరుస్తూ ఉండేవాడు. ఇటీవల అమెరికాలో వారి కొత్త ఇంటిలో దీపావళి వేడుకలను కూడా ఈ జంట జరుపుకున్నారు. మరి వారి రిలేషన్‌కు సంబంధించి వస్తున్న ఊహాగానాలకు చెక్‌ పడాలంటే ప్రియాంక తన పేరు మార్చడంలో అంతర్యం ఏంటో క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాలి. కాగా 2018 డిసెంబర్‌ 2వ తేదీన ఈ గ్లోబల్‌ జంట వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ భిన్న సంప్రదాయానికి చెందిన వారు కావడంతో హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయాల్లో ఈ జంట వివాహం జరిగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement