
ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్
తీపి కబుర్లు చెప్పుకోవడం, తియ్యని మిఠాయిలు తినిపించుకోవడం వంటివే కాదు భార్యాభర్తలు కలసి వంట చేయడం కూడా తీపి ఓ జ్ఞాపకమే. అలాంటి తీయని జ్ఞాపకాన్ని జీవిత కాలం గుర్తుంచుకోవాలనుకుంటున్నారు ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్. ఫ్రాన్స్‌లో జరిగిన నిక్ జోనస్ కజిన్ జో జోనస్‌ల పెళ్లికి హాజరయ్యాక ప్రియానిక్ ఇటలీ చెక్కేశారు. అక్కడ డిన్నర్ డేట్‌ని డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకున్నారు. ఇద్దరూ పాస్తా తయారు చేశారు. విశేషం ఏంటంటే.. ఇద్దరికీ వంట రాదు. కలసి నేర్చుకుంటూ పాస్తా చేశారు. ‘‘ఇదో అందమైన అనుభూతి’’ అంటోంది ఈ జంట.
Comments
Please login to add a commentAdd a comment