Pasta
-
3.30 నిమిషాల్లో పాస్తా ఉడకలేదని రూ.40 కోట్లు దావా..
వాషింగ్టన్: ‘రెండు నిమిషాల్లో రెడీ.. 3 నిమిషాల్లో రెడీ..’ అని ఇన్స్టంట్ ఫుడ్ ప్యాకెట్స్‌పై వివరాలు ఇస్తుంటాయి కంపెనీలు. వాటిని ఉడికించబోతే చెప్పిన సమయం కంటే ఎక్కువే తీసుకుంటాయి. అది మామూలేలే.. అని మనం పట్టించుకోం. కానీ.. ఫ్లోరిడాకు చెందిన ఈ మహిళ ఊరుకోలేదు. చెప్పిన టైమ్‌లో పాస్తా ఉడకలేదని ఫుడ్ కంపెనీపై రూ.40కోట్లు దావా వేసింది. ఫ్లోరిడాకు చెందిన అమాండా రెమీరేజ్... క్రాఫ్ట్ హీంజ్ కంపెనీకి చెందిన వెల్వెటా షెల్స్ పాస్తా అండ్ ఛీజ్‌ను కొనుగోలు చేసింది. దాన్ని మైక్రోవేవ్‌లో ఉడికిస్తే.. మూడున్నర నిమిషాల్లో రెడీ అయిపోతుందని ప్యాక్‌పై రాసి ఉంది. కానీ అందులో వివరించినట్టుగా మూడున్నర నిమిషాల్లో పాస్తా అండ్ ఛీజ్ ఉడకలేదని, ప్యాక్‌పై ఉన్న వివరాలు వినియోగదారులను పక్కదారి పట్టించే విధంగా ఉందని అమాండా ఆరోపించింది. పరిహారం కింద రూ.40 కోట్లు, జరిగిన నష్టానికి రూ.80 లక్షలు చెల్లించాలని కోర్టులో కేసు వేసింది. చదవండి: మనిషి హస్తాన్ని పోలిన భారీ హస్తం.. అది గ్రహాంతరవాసిదా! -
All In One: ఫిష్, మటన్.. పాస్తా, కేక్.. చిలగడ దుంపలు.. అన్నింటికీ ఒకటే!
ఒకప్పుడు రకరకాల రుచులను తయారు చేసుకోవడానికి బోలెడన్ని పాత్రలు అవసరం అయ్యేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ‘ఆల్ ఇన్ వన్’ అనే పద్ధతిలో ఒకే డివైజ్‌తో బోలెడన్ని రుచులు అందిస్తున్నాయి ఆధునిక వంట పాత్రలు. అలాంటిదే ఈ కుకర్ కూడా. అవసరాన్ని బట్టి పాత్రలను జోడించుకోవచ్చు. లేదంటే వాటిని తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఈ కుకర్‌లో చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు, పీతలు ఇలా చాలానే వండుకోవచ్చు. కేక్స్, పాస్తా, నూడూల్స్, రైస్ ఐటమ్స్ వంటివెన్నో తయారు చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఈ డివైజ్‌కి అదనంగా మూడు పెద్దపెద్ద స్టీమ్ బౌల్స్ లభిస్తాయి. వాటిలో వేరువేరు వెరైటీలను తయారు చేసుకోవచ్చు. మెయిన్ పార్ట్‌లో గుడ్లు, జొన్న కండెలు, చిలగడ దుంపలు వంటివి ఉడికించుకోవచ్చు. సూప్, స్టీమ్ ఇలా అన్ని ఆప్షన్స్ డివైజ్ ముందు వైపు ఉంటాయి. వాటిని సెట్ చేసుకుని ఈ కుకర్ని చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. దీని ట్రాన్స్పరెంట్ మూత అన్ని పాత్రలకు, మెయిన్ బాడీకి చక్కగా సరిపోతుంది. ధర : 252 డాలర్లు (రూ.19,313) చదవండి👉🏾Ice Cream Maker: ఇంట్లోనే నిమిషాల్లో ఐస్‌క్రీమ్‌లు తయారు చేసుకోవచ్చు.. ధర ఎంతంటే! చదవండి👉🏾Pasta Noodle Maker: పాస్తా, నూడుల్స్ ఇలా ఈజీగా.. ఈ డివైజ్‌ధర రూ. 1,990 -
8 షేపుల్లో పాస్తా తయారు చేయగలదు.. ఈ డివైజ్‌ధర రూ. 1,990
Food Preparation Equipment: పాస్తా, నూడూల్స్ వంటి ఫాస్ట్‌ఫుడ్ రుచులకు పిల్లలే కాదు పెద్దలు కూడా ఫిదా అవుతుంటారు. మరి ఆ రుచులను నిత్యం బయట కొనుక్కుని.. లేనిపోని ఆరోగ్య సమస్యలు తెచ్చుకునేకంటే ఇంటి పట్టునే చేసుకుంటే రుచికి రుచి.. శుచికి శుచి కదా! అందుకే ఈ డివైజ్. కావల్సిన ఇంగ్రీడియన్స్ సిద్ధం చేసుకుంటే చాలు.. మొత్తంగా 8 షేపుల్లో పాస్తా తయారు చేయగలదు. దీని ముందు భాగంలో (కనిపిస్తున్న విధంగా) మనకు కావల్సిన షేప్‌కి సంబంధించిన వైట్ కలర్ క్యాప్ సెట్ చేసుకుని, మెషిన్ పైభాగంలో అన్ని ఇంగ్రీడియన్స్‌తో పాటు.. గుడ్లు లేదా వెజిటబుల్స్ జ్యూస్ లేదా వాటర్ జోడించి పెట్టుకోవాలి. మనకు ఎగ్ నూడూల్స్ కావాలంటే ఎగ్ జోడించుకోవచ్చు. లేదంటే వెజిటబుల్ జ్యూస్ లేదా వాటర్ పోసుకోవచ్చు. ఈ మెషిన్ పార్ట్స్‌ని వేరు చేసి క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులభం. దాంతో చాలా ఫ్లేవర్స్‌లో పాస్తా, నూడూల్స్ వంటివి వండుకోవచ్చు. అందుకు సంబంధించిన అన్ని ఆప్షన్స్ డివైజ్ పైభాగంలోని ఒకవైపున ఉంటాయి. దాంతో దీన్ని తేలికగా ఉపయోగించుకోవచ్చు. ధర: 26 డాలర్లు (రూ.1,990) చదవండి👉🏾Baby Food Device: బుల్లి బుజ్జాయిల కోసం.. ఈ డివైజ్ ధర 4,947 రూపాయలు -
వైరల్: ఛీ, ఎందుకురా ఆడుకుంటారు?
మీకు స్నాక్స్‌లో అన్నింటికన్నా పాస్తా ఎక్కువ ఫేవరెటా? దాన్ని తినకుండా ఉండటం మీ వల్ల కాదా? అయితే మీకు ఓ హెచ్చరిక లాంటి విజ్ఞప్తి. పాస్తాతో రెడీ చేసిన ఓ కొత్త వంటకం నెట్టింట చక్కర్లు కొడుతూ ఆహార ప్రియుల కడుపు మీద కొడుతోంది. దాన్ని చూసిన మరుక్షణం కొందరు కళ్లు మూసుకుంటుంటే మరికొందరు అది కూడా వంటకమే అన్న విషయాన్ని జీర్ణించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ అందరూ చూపు తిప్పేసుకుంటున్న అంతటి ఘోర పాకం ఏంటి? ఎలా చేశారో? చదివేయండి.. (చదవండి: గొప్ప అదృష్టం: చెత్త కుప్పనుంచి మంత్రి ఆఫీసుకు..) జస్టిన్ ఫ్లామ్ అనే అమెరికన్ మెజీషియన్ ఓ గిన్నె తీసుకుని అందులో ఎనర్జీ డ్రింక్ పోశాడు. అది వేడెక్కిన తర్వాత పాస్తాను గుమ్మరించాడు. కాసేపు ఆ మిశ్రమాన్ని కలిపిన తర్వాత ప్లేటులోకి తీసుకున్నాడు. తర్వాత మరో గిన్నె స్టౌ మీద పెట్టి అందులో పిండి, నీళ్లు పోసి సాస్‌లా దగ్గరపడేవరకు కలుపుతూనే ఉన్నాడు. అది కాస్త చిక్కబడగానే దాన్ని ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తామీద అప్లై చేశాడు. 'ఇది చూసిన తర్వాత పాస్తాను మీరు ఎప్పటిలాగే రెడీ చేసుకుని తినలేరు' అన్న క్యాప్షన్‌తో షేర్ చేశాడు. చూస్తుంటేనే ఒళ్లు జలదరిస్తున్న ఈ రెసిపీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇది చూసిన జనాలు ఆ వంటకాన్ని చీదరించుకోవడమో, దాన్ని తయారు చేసినవాడికి చీవాట్లు పెట్టకుండానో ఉండలేకపోతున్నారు. "ఎందుకురా ఇలాంటివి చేసి జీవితంలో వాటిని తినకుండా చేస్తారు?", "పాస్తాను సర్వనాశనం చేశారు" అంటూ పాస్తా ప్రియులు ఆవేదన చెందుతున్నారు. "ఛీ, దీన్ని చూడటం వల్ల నా టైమ్ వేస్ట్ అయింది" అంటూ మరికొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: ఆల్రెడీ పెళ్లైన ప్రేయసి ఇంటికి సొరంగం) -
సెకన్లలో ప్లేట్ ఖాళీ..
-
సెకన్లలో ప్లేట్ ఖాళీ.. రికార్డుకెక్కింది..
న్యూయార్క్ : ఓ ప్లేటు నిండా ఉన్న పాస్తాను తినడానికి ఎంత సమయం పడుతుంది?.. తక్కువలో తక్కువ అంటే 5 నిమిషాలు. అంతకంటే తక్కువ సమయంలో తింటే ఏమవుతుంది?.. కచ్చితంగా రికార్డు అవుతుంది. మీరు అత్యంత తక్కువ సమయంలో పాస్తాను తిని గిన్నిస్ రికార్డుకెక్కాలంటే మాత్రం ‘మిచెలీ’ అనే మహిళ రికార్డును బ్రేక్ చేయాల్సి ఉంటుంది. అమెరికాలోని అరిజోనాకు చెందిన మిచెలీ లెస్కో కొద్దిరోజుల క్రితం 100 గ్రాముల పాస్తాను 26.9 సెకన్లలో తినటం పూర్తి చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కింది. అంతకు క్రితం ఉన్న 45 సెకన్లపై ఉన్న రికార్డును సైతం మిచెలీ తుడిచిపెట్టింది. ( పిచ్చి పీక్స్‌కు వెళ్లడం అంటే ఇదే! ) ఇందుకు సంబంధించిన వీడియోను గిన్నిస్ బుక్ తన అధికారిక ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో షేర్ అయిన రెండు గంటల్లోనే లక్షల కొద్ది వ్యూస్ సంపాదించుకుంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ అద్భుతం.. గిన్నిస్ బుక్ వాళ్లను నా వద్దకు పంపండి. నేను 10 సెకన్లలో పాస్తాను తింటాను.. బాగా ఆకలి మీద ఉన్నట్లుంది. ఠక్కున తినేసింది.. అలా తింటే వాష్‌రూంలో కూర్చోవల్సి ఉంటుంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
పాస్తా చేస్తాం!
తీపి కబుర్లు చెప్పుకోవడం, తియ్యని మిఠాయిలు తినిపించుకోవడం వంటివే కాదు భార్యాభర్తలు కలసి వంట చేయడం కూడా తీపి ఓ జ్ఞాపకమే. అలాంటి తీయని జ్ఞాపకాన్ని జీవిత కాలం గుర్తుంచుకోవాలనుకుంటున్నారు ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్. ఫ్రాన్స్‌లో జరిగిన నిక్ జోనస్ కజిన్ జో జోనస్‌ల పెళ్లికి హాజరయ్యాక ప్రియానిక్ ఇటలీ చెక్కేశారు. అక్కడ డిన్నర్ డేట్‌ని డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకున్నారు. ఇద్దరూ పాస్తా తయారు చేశారు. విశేషం ఏంటంటే.. ఇద్దరికీ వంట రాదు. కలసి నేర్చుకుంటూ పాస్తా చేశారు. ‘‘ఇదో అందమైన అనుభూతి’’ అంటోంది ఈ జంట. -
పాస్తా తినే మహిళలకు శుభవార్త
లండన్: ఇటాలియన్ ఫేమస్ వంటకమైన పాస్తా మీరు తింటున్నారా... అయితే పాస్తా ప్రేమికులకు, ముఖ్యంగా మహిళలకు ఇది నిజంగానే శుభవార్త. పాస్తా తింటే ఊబకాయం రాదని శాస్త్రవేత్తలు చెబున్నారు. అంతేకాదు ఊబకాయం మన దరిచేరకుండా చేస్తుందని వెల్లడించారు. ఇటలీ సంస్థ ఐఆర్సీసీఎస్ న్యూరోమెడ్ శాస్త్రవేత్తలు సుమారు 23 వేల మందిపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పాస్తాను నిత్యం ఆహారంగా తీసుకునే వారు బరువు పెరగలేదని, వారిలో ఊబకాయ సమస్య కూడా తలెత్తలేదని శాస్త్రవేత్తల్లో ఒకరైనా జార్జ్ పునిస్ తెలిపారు. పాస్తా తినేవారు ఆరోగ్యంగాను, సన్నని నడుముతోనూ ఉన్నారని పునిస్ పేర్కొన్నారు. బరువు పెరిగె అవకాశాలు ఉంటాయని అపోహపడి చాలా మంది మహిళలు పాస్తా అంటే ఎంతో ఇష్టం ఉన్నా, చాలా సందర్భాలలో నోరు కట్టేసుకుని ఉండాల్సి వస్తోంది. పాస్తా తింటే బరువు పెరుగుతామని చాలా మంది అపోహ పడతారని, అందులో నిజం లేదని ఐఆర్సీసీఎస్ పరిశోధకులు అంటున్నారు. ఈ అధ్యయనంలో తేలిన విషయాలను ఇటీవల విడుదలైన న్యూట్రీషియన్, డయాబెటిస్ జర్నల్‌లో ఈ వివరాలను ప్రచురించారు.