వీడియో దృశ్యాలు
న్యూయార్క్ : ఓ ప్లేటు నిండా ఉన్న పాస్తాను తినడానికి ఎంత సమయం పడుతుంది?.. తక్కువలో తక్కువ అంటే 5 నిమిషాలు. అంతకంటే తక్కువ సమయంలో తింటే ఏమవుతుంది?.. కచ్చితంగా రికార్డు అవుతుంది. మీరు అత్యంత తక్కువ సమయంలో పాస్తాను తిని గిన్నిస్ రికార్డుకెక్కాలంటే మాత్రం ‘మిచెలీ’ అనే మహిళ రికార్డును బ్రేక్ చేయాల్సి ఉంటుంది. అమెరికాలోని అరిజోనాకు చెందిన మిచెలీ లెస్కో కొద్దిరోజుల క్రితం 100 గ్రాముల పాస్తాను 26.9 సెకన్లలో తినటం పూర్తి చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కింది. అంతకు క్రితం ఉన్న 45 సెకన్లపై ఉన్న రికార్డును సైతం మిచెలీ తుడిచిపెట్టింది. ( పిచ్చి పీక్స్‌కు వెళ్లడం అంటే ఇదే! )
ఇందుకు సంబంధించిన వీడియోను గిన్నిస్ బుక్ తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో షేర్ అయిన రెండు గంటల్లోనే లక్షల కొద్ది వ్యూస్ సంపాదించుకుంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ అద్భుతం.. గిన్నిస్ బుక్ వాళ్లను నా వద్దకు పంపండి. నేను 10 సెకన్లలో పాస్తాను తింటాను.. బాగా ఆకలి మీద ఉన్నట్లుంది. ఠక్కున తినేసింది.. అలా తింటే వాష్‌రూంలో కూర్చోవల్సి ఉంటుంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment