
గ్లోబల్ కపుల్ ప్రియాంక చోప్రా-నిక్ జోనస్ 2018 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పుడు వాళ్లు పెళ్లికి రెడీగా లేరట. ఈ విషయాన్ని ప్రియాంక తన పుస్తకం "ప్రియాంక చోప్రా జోనస్"లో రివీల్ చేసింది. నిజానికైతే 2019 వరకు పెళ్లిమాట ఎత్తకూడదని అనుకున్నారట. కానీ నిక్ భారత్ పర్యటనకు రావడం, పెళ్లి ప్రస్తావన తేవడం, కాదనలేక ఓకే చెప్పడం, వెంటనే పెళ్లి జరగడం చకచకా జరిగిపోయాయి. "వాస్తవానికైతే ఓ సంవత్సరం ఆలస్యంగా వివాహం చేసుకుందామనుకున్నాం. కానీ భారత్ పర్యటనకు వచ్చినప్పుడు నిక్ పెళ్లికి తొందర పెట్టాడు. మాకు, మా కుటుంబ సభ్యులకు కూడా దీనికి ఎలాంటి అభ్యంతరం లేదు. అలాంటప్పుడు ఎందుకు ఆలస్యం చేయడం అనిపించింది. అందుకని అప్పుడే ముహూర్తాలు చూసుకుని పెళ్లి పీటలెక్కాం" అని ప్రియాంక చెప్పుకొచ్చింది.
వీరి పెళ్లై రెండు సంవత్సరాలవుతోంది. మొన్నటి ప్రేమికుల రోజున నిక్ తన అర్ధాంగికి గులాబీల పుష్పగుచ్ఛాలను కానుకగా పంపాడు. ప్రియాంక కూడా లాస్ ఏంజెల్స్‌లోని నిక్ నివాసాన్ని ప్రేమ సందేశంతో నింపేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయించిందట. ఇదిలా వుంటే పెళ్లికి ముందు వీళ్లిద్దరూ ఓ కండీషన్ పెట్టుకున్నారు. వృత్తి రీత్యా ఇద్దరూ ఎవరికి వారు వివిధ దేశాలకు వెళ్లవలసి వస్తుంది, కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నెలలోని చివరి వారంలో కలుసుకుని తీరాల్సిందేనని నియమం పెట్టుకున్నారట.
Comments
Please login to add a commentAdd a comment