ఇదే మా లవ్‌స్టోరీ! | Nick Jonas reveals how he fell in love with Priyanka Chopra | Sakshi
Sakshi News home page

ఇదే మా లవ్‌స్టోరీ!

Published Tue, Sep 11 2018 12:39 AM | Last Updated on Tue, Sep 11 2018 4:28 AM

Nick Jonas reveals how he fell in love with Priyanka Chopra - Sakshi

ప్రియాంకా చోప్రా, నిక్‌ జోనస్‌

ఇప్పుడు ప్రియాంకా చోప్రా, నిక్‌ జోనస్‌ ఇటు బాలీవుడ్‌ అటు హాలీవుడ్‌ క్రేజీ కపుల్‌. పదేళ్ల వయసు వ్యత్యాసం ఉన్న ఈ జంట ఇటీవల రోకా (నిశ్చితార్థం) ద్వారా ఒక్కటయ్యారు. అయితే వీళ్ల లవ్‌స్టోరీ ఎప్పుడు స్టార్ట్‌ అయింది? ఎలా స్టార్ట్‌ అయింది? అని ప్రియాంక అభిమానులంతా తెలుసుకోవాలనుకుంటున్నారు. వాళ్ల లవ్‌స్టోరీని నిక్‌ జోనస్‌ వివరంగా కాకపోయినా కొంచెం క్లుప్తంగా చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ హాలీవుడ్‌ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న నిక్‌ని అడగ్గా – ‘‘ప్రియాంక, నేను కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా మీట్‌ అయ్యాం. ఫస్ట్‌ మెసేజెస్‌ ద్వారా మాట్లాడుకునేవాళ్లం. ఆ తర్వాత ఫోన్‌ కాల్స్‌.  ఇలా కొన్ని నెలలు గడిచాయి.

మళ్లీ మేం పర్సనల్‌గా కలవడానికి ఆరు నెలలు పట్టింది. అప్పుడు మేం ఫస్ట్‌ టైమ్‌ ‘మెట్‌ గాలా’ ఈవెంట్‌కి హాజరయ్యాం. అప్పటికి మేం ఇంకా ఫ్రెండ్స్‌గానే ఉన్నాం. మా కామన్‌ ఫ్రెండ్స్‌ అందరూ మా మధ్య ఏదో ఉందని ఊహించుకుని, అడిగే వారు. కానీ మా ఇద్దరి సమాధానం మాత్రం ఒక్కటే ‘మేం ఫ్రెండ్స్‌’ మాత్రమే అని. మా జర్నీ అలా కొనసాగింది. అందరూ మేం దాస్తున్నాం అనుకునేవాళ్లు. ఐదు నెలల క్రితమే మా రిలేషన్‌షిప్‌ పట్ల మేం సీరియస్‌గా ఉన్నాం అని ఫీల్‌ అయ్యాం. ఇదే రైట్‌ టైమ్‌ అని మా ఇద్దరికీ అర్థం అయింది. వెంటనే ఎంగేజ్‌ అయిపోయాం’’ అని పేర్కొన్నారు. అలాగే ఇద్దరికీ కలిపి పెట్టిన పేర్లలో ‘ప్రిక్‌’ అన్నది తనకి నచ్చిందని కూడా చెప్పారు.

బాలీవుడ్‌–టాక్‌ షో–బుక్‌ – ఆ తర్వాతే మ్యారేజ్‌?
నిక్‌తో ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక ప్రియాంకకి ఎదురౌతున్న ప్రశ్న, పెళ్లెప్పుడు? అని. కానీ అది ఇప్పట్లో ఉండకపోవచ్చని అర్థం అవుతోంది. ప్రస్తుతం ప్రియాంక కెరీర్‌ పరంగా ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రస్తుతం తన కెరీర్‌ ప్లాన్స్‌ గురించి మాట్లాడుతూ– ‘‘నాలుగేళ్ల విరామం తర్వాత బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నాను. ఆ ప్రాజెక్ట్‌పై చాలా ఎగై్జటింగ్‌గా ఉన్నాను. అలాగే ‘ఇఫ్‌ ఐ కుడ్‌ టెల్‌ యు జస్ట్‌ వన్‌ థింగ్‌’ (నేను నీకు ఒక్క విషయం మాత్రమే చెప్పగలిగితే) అనే షో చేయనున్నాను. ప్రపంచంలో ఉన్న స్ఫూర్తిదాయకమైన వాళ్లతో ఇంటర్వ్యూలా సాగనుంది ఈ షో.

వాళ్ల సక్సెస్‌కి కారణమైన ఒక్క ముఖ్యమైన విషయాన్ని ఈ షోలో నాతో షేర్‌ చేసుకుంటారు. అలాగే ఓ బుక్‌ కూడా రాద్దాం అనే ప్లాన్‌లో ఉన్నాను ఆ తర్వాత పెళ్లి ప్లాన్‌లో ఉన్నాం’’ అని పేర్కొన్నారు ప్రియాంక. కూతురి పెళ్లి విషయం గురించి ప్రియాంక తల్లి మధుచోప్రా మాట్లాడుతూ– ‘‘అందరూ అనుకుంటున్నట్లు వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటారన్నది అవాస్తవం. వాళ్లింకా పెళ్లి డేట్‌ ఫిక్స్‌ చేసుకోలేదు. అవి రూమర్స్‌ మాత్రమే. ప్రస్తుతం వర్క్‌ కమిట్‌మెంట్స్‌లో బిజీగా ఉన్నారు. పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? ఎక్కడ చేసుకోవాలి? అని డిసైడ్‌ అయితే వాళ్లే చెబుతారు’’ అని పేర్కొన్నారు. మరి... ‘ప్రిక్‌’ పెళ్లి ఎప్పుడో కాలమే చెప్పాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement