ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది మెట్‌గాలా ఫ్యాషన్ షో సినీ తారల సందడితో అదిరిపోయింది. డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌తో ఈ వేడుక కన్నుల పండువగా జరిగింది. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటిన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్, కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్ ఏటా ఒక్కో థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటుంది. ప్రతి ఏడాది మేలో వచ్చే మొదటి సోమవారం ఈ వేడుక న్యూయార్క్‌లో జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన డబ్బును పలు స్వచ్ఛంద సేవా సంస్థలకు విరాళంగా అందిస్తారు.
ఈ ఏడాది ఎప్పటిలాగే చాలామంది హాలీవుడ్ తారలు ఈ ఫ్యాషన్ షోలో అలరించారు. ‘క్యాంప్: నోట్స్ ఆన్ ఫ్యాషన్’ అనేది ఈ మెట్‌గాలా–2019 థీమ్. ఈ వేడుకలో ప్రియాంకా చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ పింక్ కార్పెట్‌పై నడిచారు. ఈ జంట సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయింది. ఈ ఈవెంట్‌లో ప్రియాంక పాల్గొనడం ఇది మూడోసారి. అలాగే మరో బ్యూటీ దీపికా పదుకోన్ కూడా పాల్గొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రియాంకా లుక్‌కు నెటిజన్ల నుంచి విమర్శలు వచ్చాయి. ‘ఏమంత బాగాలేవు.. వరస్ట్ లుక్’ అని పలువురు కామెంట్ చేశారు. ‘బెస్ట్ కపుల్.. వరస్ట్ లుక్’ అని కూడా కొందరు అన్నారు.
బెస్ట్ కపుల్... వరస్ట్ లుక్
Published Wed, May 8 2019 1:06 AM | Last Updated on Wed, May 8 2019 1:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment