బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లి జోరుగా సినిమాలు చేస్తున్నారు ప్రియాంకా చోప్రా. లాక్‌డౌన్ పూర్తయిన వెంటనే హాలీవుడ్‌లో చిత్రీకరణలు ప్రారంభించారు. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలతో ఫుల్ బిజీబిజీగా ఉన్నారామె. కొన్ని నెలలుగా ‘టెక్ట్స్ ఫర్ యూ’ సినిమా షూటింగ్ నిమిత్తం లండన్‌లో ఉంటున్నారామె. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు. జిమ్ స్ట్రౌస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా భర్త నిక్ జోనస్ అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్.
Comments
Please login to add a commentAdd a comment