‘బై బై వండర్‌ ల్యాండ్‌.. తిరిగి 2020లో కలుద్దాం’ | Priyanka Chopra Shares Romantic Beach Side Pics With Her Husband Nick Jonas | Sakshi
Sakshi News home page

కాలిఫోర్నియా బీచ్‌లో గ్లోబల్‌ జంట చక్కర్లు

Dec 30 2019 11:00 AM | Updated on Dec 30 2019 11:56 AM

Priyanka Chopra Shares Romantic Beach Side Pics With Her Husband Nick Jonas - Sakshi

కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేందుకు రెండు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే సెలబ్రిటీ జంటలంతా న్యూ ఇయర్‌ వేడుకల కోసం రొమాంటిక్‌ ప్రదేశాలను చుట్టే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో గ్లోబల్‌ కపుల్‌ ప్రియాంక చోప్రా, నిక్‌ జోనస్‌లు కూడా కొత్త సంవత్సర వేడుకల కోసం కాలిఫోర్నియాలో వాలిపోయారు. తాజాగా క్రిస్మస్‌ వేడుకను అంగరంగా వైభవంగా జరుకున్న ఈ జంట న్యూయర్‌ వెకేషన్‌ కోసం కాలిఫోర్నియా సముద్ర తీరంలో చక్కర్లు కొడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

పడవలో తన భర్త నిక్‌ కాళ్లపై కుర్చుని సముద్రం మధ్యలో ఉన్న ఫోటోలను ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆదివారం షేర్‌ చేశారు. అప్పుడే బయటకు వచ్చిన సూర్యుని కిరణాలు వారిని తాకుతున్నట్లు అందంగా ఉన్న ఈ జంట ఫోటోలు చూసి నెటిజన్లు ఫీదా అవుతున్నారు. నిక్‌ ఒక చేతితో గ్లాసును, మరో చేతితో ప్రియాంకను పట్టుకుని ఉన్న ఈ పోస్టుకు ఇప్పటివరకు  1.6 మిలియన్ల లైక్స్‌ రాగా వందల్లో కామెంట్లు వస్తున్నాయి. వీరిద్దరు ఉన్న పడవ వైపు మరో పడవ వస్తున్నట్లు కనిపించే ఈ ఫోటోను చూసి  హాలీవుడ్‌ నటుడు ‘మీ వైపుకు వస్తున్న బోటులో ఉన్నది నేనే’  అంటూ సరదాగా కామెంటు చేశాడు.

Life as it should be. 🌊 ❤️📸 @divya_jyoti

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

అలాగే ప్రియాంక బీచ్‌లో తెల్లని నైట్‌ గౌనులో చేతిలో గ్లాసు పట్టుకుని ఉన్న ఫోటోకి ‘ సో నో కంప్లైంట్స్’  అనే క్యాప్షన్‌తో సోమవారం తెల్లవారు జామున షేర్‌ చేశారు. కాగా  కాలిఫోర్నియాలోని మమ్మొత్‌ మంచు కొండలపై విహరిస్తూ దిగిన వీరిద్దరు ఫోటోలను కూడా ప్రియాంక పోస్ట్‌ చేశారు. నల్లటి, తెలుపు రంగు ట్రాక్‌ సూట్‌ ధరించి, స్నో బూట్స్‌, హెల్మెట్స్‌తో ఉన్న ఈ ఫోటోకి ‘వింటర్‌ వండర్‌ ల్యాండ్‌కు బై.. తిరిగి 2020లో కలుద్దాం. ట్విన్నింగ్‌ ఈజ్‌ విన్నింగ్‌’ అనే క్యాప్షన్‌కు హ్యాష్‌ ట్యాగ్‌ను జత చేసి షేర్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement