Samantha Comment On Priyanka Chopra Video And Said Amazing - Sakshi
Sakshi News home page

Samantha: ప్రియాంక వీడియోపై సమంత కామెంట్‌, దీని అంతర్యం ఏంటి సామ్‌?

Published Thu, Nov 25 2021 2:25 PM | Last Updated on Thu, Nov 25 2021 7:14 PM

Samantha Comment On Priyanka Chopra Video And Said Amazing - Sakshi

Samantha Comments On Priyanka Chopra Video: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జొనాస్ నుంచి విడిపోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా వీరి విడాకులపైనే తెగ చర్చ జరుగుతోంది. దీంతో చై-సామ్‌ల విడాకుల మ్యాటర్‌ కూడా తెరపై వచ్చింది. సామ్‌ మాదిరిగానే ప్రియాంక నిక్‌ ఇంటి పేరు తీసేసింది. దీంతో ప్రియాంక కూడా నటి సమంతలా విడాకులు తీసుకోబోతుందా అని గుసగుసలు వినిపించగా ఈ రూమార్లకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ ప్రియాంక ఓ వీడియో వదిలిన సంగతి తెలిసిందే.  

చదవండి: ప్రియాంక తన భర్త పేరు అందుకే తొలగించిందట!

ప్రియాంక తన ఇన్‌స్టా గ్రామ్‌లో వీడియో షేర్‌ చేస్తూ.. నిక్ జోనస్‌, జోనస్‌ బ్రదర్స్ కంటే తనకే ఎక్కువ ఫాలోవర్స్‌ ఉ‍న్నారంటూ వారిని ఆటపట్టించింది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జరిగిన జొనాస్‌ బ్రదర్స్‌ ఫ్యామిలీ రోస్ట్ అనే షోలో జొనాస్‌ కుటుంబం పాల్గొంది. ఈ షోకి జొనాస్‌ బ‍్రదర్స్‌తోపాటు వారి సతీమణులు కూడా హాజరయ్యారు. ప్రముఖ కమెడియన్‌ కెనన్‌ థాంప్సన్‌ హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే దీనిపై సమంత స్పందించింది. అమేజింగ్ అని క్యాప్షన్స్ ఇస్తూ ప్రియాంక వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. దీంతో ఆమె పోస్ట్‌ వార్తల్లోకి ఎక్కింది.

చదవండి: సమంతపై నెటిజన్ల ఫైర్‌

తన మాజీ భర్త నాగచైతన్య బర్త్‌డేకు విషెస్‌ చెప్పని సమంత తన పెంపుడు కుక్క హాష్‌కు బర్త్‌డే విషెస్‌ తెలుపుతూ ఇన్‌స్టా స్టోరీ నింపేయడంతో  పాటు ప్రియాంక వీడియోకు ప్రత్యేకంగా కామెంట్‌ చేయడం ఆసక్తి నెలకొంది. ఇక చై-సామ్‌ మాదిరిగా గ్లోబల్‌ కపుల్‌ కూడా విడాకులకు సిద్దమవుతున్నారా? అంటూ వారిపై రూమార్స్‌ రాగా వాటికి ప్రియాంక సమాధానం చెప్పకనే చెబుతూ ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ఈ క్రమంలో ప్రియాంక వీడియో సామ్‌ అమెజింగ్‌ అని కామెంట్‌ పెట్టడం, దానిని ఇన్‌స్టాలో షేర్‌ చేయడంతో ఆసక్తిగా మారింది. దీని వెనక సామ్‌ అంతర్యం ఏంటంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

చదవండి: మరో వ్యక్తితో ఎఫైర్‌.. అందుకే విడిపోయాం : హీరో షాకింగ్‌ కామెంట్స్‌

కాగా ఈ వీడియోలో ప్రియాంక 'నేను సంస్కృతి, వినోదం, సంగీతానికి గొప్ప స్థానం ఉన్న భారతదేశం నుంచి వచ్చాను. నా కంటే 10 ఏళ‍్లు చిన్నవాడు నిక్‌. మేమిద్దరం అనేక విషయాలు మాట్లాడుకుంటాం. నాకు టిక్‌టాక్ ఎలా ఉపయోగించాలో నిక్‌ నేర్పితే, సక్సెస్‌ఫుల్‌ యాక్టింగ్‌  కెరీర్‌ ఎలా ఉంటుందో నేను చూపించాను. నాకు నిక్‌పై చాలా ప్రేమ ఉంది. నా జీవితాన్ని అతను పూర‍్తిగా మార్చేశాడు. జొనాస్‌ బ్రదర్స్‌కు పిల్లలున్నారు. మాది మాత్రమే పిల్లలు లేని జంట. కానీ ఇవాళ అందరిముందు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా. మేమిద్దరం ఈరోజు రాత్రి డ్రింక్ చేసి, రేపు ఉదయం ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకుంటున్నాం. ఈ షోలో జొనాస్‌ బ్రదర్స్‌ను రోస్ట్‌ చేయడం థ్రిల్లింగ్‌గా ఉంది'. అని ప్రియాంక చెప్పుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement