
ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌ల ప్రేమ నిజమైందేనా?
‘ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌లను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరాలనుకుంటున్నా. వారితో పాటుగా నా రాతల వల్ల బాధ పడిన పాఠకులను కూడా. నిజానికి జాత్యహంకారం, జినోఫోబియా వంటి వాటిని నేను సహించను. నేను రాసిన కథనానికి పూర్తి బాధ్యత నాదే. నిజంగా నేను తప్పు చేశాను. క్షమించండి’ అంటూ ద కట్ రైటర్ మారియా స్మిత్ ప్రియానిక్ దంపతులను ట్విటర్ వేదికగా క్షమాపణ కోరారు. (‘నిక్.. వీలైనంత తొందరగా ప్రియాంకతో తెగదెంపులు చేసుకో’)
కాగా ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌ల ప్రేమ నిజమైందేనా? అనే టైటిల్‌తో మారియా స్మిత్ ‘ద కట్’ వెబ్‌సైట్‌లో కథనం రాసిన సంగతి తెలిసిందే. మొదట ప్రియాంక సూపర్‌స్టార్ అంటూ వ్యంగ్యంగా ఆర్టికల్‌ను ప్రారంభించిన మారియా.. ఆ తర్వాత ఆమె రేసిస్ట్, సెక్సిస్ట్, గ్లోబల్ స్కామ్ ఆర్టిస్ట్ అంటూ పరుష పదజాలాన్ని ఉపయోగించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా మారియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మారియా కథనాన్ని తొలగించిన ద కట్ యాజమాన్యం ప్రియానిక్‌లను క్షమాపణ కోరింది. అయితే మొదట తానేమీ అందరికీ వినోదం పంచేందుకు ఇలా రాయలేదన్న మారియా.. తాజాగా క్షమాపణలు కోరారు.
— mariah smith (@mRiah) December 7, 2018