బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రా తొలిసారిగా తన కూతుర్ని పరిచయం చేసింది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను తరచూ అభిమానులతో షేర్ చేస్తుంటుంది. అయితే కూతురు మాల్తీ మేరీని మాత్రం ఇంతవరకు ఎక్కడా రివీల్ చేయలేదు. గతంలో కొన్ని ఫోటోలు షేర్ చేసినా పాప మాల్తీ ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతుండేది.
అయితే రీసెంట్‌గా జొనాస్ బ్రదర్స్ వాక్ ఆఫ్ ఫేమ్ ఈవెంట్‌లో ప్రియాంక తన గారాలపట్టి మాల్తీతో కలిసి వేడుకలకు హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రియాంక ఒళ్లో కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్న మాల్తీ వైట్ డ్రెస్‌లో క్యూట్‌గా ఉంది.
కాగా అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్, ప్రియాంక చోప్రాలు 2018న ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సరోగసి ద్వారా ప్రియాంక బిడ్డను కన్నారు. అయితే అప్పటినుంచి ఇంతవరకు పాప ముఖాన్ని చూపించలేదు. కానీ తొలిసారిగా మాల్తీ ఫేస్‌ను రివీల్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment