‘తను ఆ మాట చెప్పగానే ఏడ్చేశాను’ | Parineeti Chopra Comments On Priyanka Nick Love Story | Sakshi
Sakshi News home page

‘తను ఆ మాట చెప్పగానే ఏడ్చేశాను’

Oct 2 2018 4:10 PM | Updated on Oct 2 2018 7:56 PM

Parineeti Chopra Comments On Priyanka Nick Love Story - Sakshi

ప్రియాంక చోప్రా- పరిణీతి చోప్రా

తనకి వీడియో కాల్‌ చేశాను. అప్పుడే తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపించింది. దాంతో నాకు స్పృహ తప్పినంత పనైంది.

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌లు.. ప్రస్తుతం బాలీవుడ్‌, హాలీవుడ్‌లలో క్రేజీ కపుల్‌. పదేళ్ల వయసు వ్యత్యాసం ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో ఇటీవలే ఎంగేజ్‌మెంట్‌ జరుపుకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ లవ్‌బర్డ్స్‌ తమ ప్రేమ విషయాన్ని మొదట తనకే చెప్పారని ప్రియాంక కజిన్‌ పరిణీతి చోప్రా అన్నారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..‘  ఆరోజు అక్క(ప్రియాంక చోప్రా) బర్త్‌డే. ఉదయం 3 గంటలకు తన మిస్స్‌డ్‌ కాల్‌ ఉంది. వెంటనే తనకి వీడియో కాల్‌ చేశాను. అప్పుడే తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపించింది. దాంతో నాకు స్పృహ తప్పినంత పనైంది. అంతలోనే నిక్‌ కూడా కాల్‌లో జాయిన్‌ అయ్యాడు. తామిద్దరం ప్రేమలో ఉన్నట్లు ఇద్దరూ ఒకేసారి నాకు చెప్పారు. తమ ప్రేమ గురించి నాకే మొదటగా చెప్పామన్నారు. నేను ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాను. ఆనందంతో ఏడ్చేశాను. వారిద్దరు చూడముచ్చటైన జంట’ అంటూ అక్కా బావలపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు పరిణీతి చోప్రా.

అంతేకాకుండా.. ‘నిక్‌ ఎంతో పరిణతి కలిగిన వ్యక్తి. తను అక్కను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. పెద్దమ్మ అంగీకారం కోసం చాలా కాలం ఎదురుచూశాడు. అంతా సవ్యంగా జరిగింది. ప్రస్తుతం అందరం హ్యాపీగా ఉన్నాం. మా అక్కని జాగ్రత్తా చూసుకోవాలంటూ తనని ఎప్పుడూ ఆటపట్టిస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది ఈ కొంటె మరదలు పిల్ల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement